వరంగల్ జిల్లా వ్యాప్తంగా టైపు-1 డయాబెటిస్ సర్వే ప్రారంభం

వరంగల్ జిల్లా వ్యాప్తంగా టైపు-1 డయాబెటిస్ సర్వే ప్రారంభం

వరంగల్ జిల్లా వ్యాప్తంగా టైపు-1 డయాబెటిస్ సర్వే ప్రారంభం

వరంగల్, జూలై 2, తెలంగాణ జ్యోతి : జిల్లా వ్యాప్తంగా 30 సంవత్సరాల లోపు ఇన్సులిన్ తీసుకుంటున్న టైపు-1 డయాబెటిస్ రోగుల సమాచార సేకరణ కోసం ప్రత్యేక సర్వే బుధవారం నుండి ప్రారంభం కానున్నట్లు వరంగల్ జిల్లా ఎన్సిడి ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ పోరిక రవీందర్ ఒక ప్రకటన తెలిపారు. ఈ సర్వేలో ప్రతి ఆశా వర్కర్ హౌస్ టు హౌస్ పద్ధతిలో నిర్వహించాల్సి ఉంటుందాని, 30 సంవ‍త్సరాల లోపు ఉండి ఇన్సులిన్ వాడుతున్న వారిని గుర్తించి, వారి వివరాలను నిర్దేశిత ఫార్మెట్‌లో నమోదు చేయాల్సి ఉంటుందని సూచిం చారు. ఏఎన్ఎంలు, సూపర్‌వైజర్లు ఆశాల పనిని పర్యవే క్షిస్తూ అవసరమైన మార్గదర్శకాలు, సూచనలు ఇవ్వాలని తెలిపారు. రేపు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు సర్వే నిర్వహించాలని, జిల్లా అధికారులకు మధ్యాహ్నం 2.30 లోగా రిపోర్ట్ పంపించాలని ఆదేశించారు. ప్రతి మండల పాపులేషన్‌ను నాలుగు రోజులుగా విభజించి సర్వే చేపట్టాలని, ప్రతి కార్యకలాపానికి సంబంధించిన ఫోటోలు అధికార గ్రూపుల్లో షేర్ చేయాలన్నారు. ముఖ్యంగా 30 సంవత్సరాల లోపు ఇన్సులిన్ వాడుతున్న వారి డాటా ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ రవీందర్ తెలిపారు.

[metaslider id="19893"]

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment