లక్ష్మి పురం గ్రామాన్ని చుట్టుముట్టిన గోదావరి వరద.

లక్ష్మిపురం గ్రామాన్ని చుట్టుముట్టిన గోదావరి వరద. 

లక్ష్మిపురం గ్రామాన్ని చుట్టుముట్టిన గోదావరి వరద

వెంకటాపురం, ఆగస్టు 21, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం పాత్రపురం పంచాయతీ పరిధిలోని లక్ష్మీపురం గిరిజన గ్రామాన్ని గోదావరి వరద నీరు చుట్టుముట్టడంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. పాలెం వాగు, పులిబొందల వాగుల గుండా వచ్చిన గోదావరి వరద ప్రవాహంతో గ్రామం ద్వీపంలా మారిపోయింది. సుమారు 14 కుటుంబాలు, 70 మందికి పైగా గిరిజనులు నివసిస్తున్న ఈ గ్రామం నాలుగు రోజులుగా బయటి ప్రపంచంతో సంబంధాలు కోల్పోయింది. వరద నీరు పెరుగు తుండటంతో గ్రామస్తులు గుట్టలపైకి ఎక్కి కాలినడకన నాలుగైదు కిలోమీటర్లు ప్రయాణించి పాత్రపురం గ్రామానికి చేరుకుని నిత్యావసర వస్తువులు తెచ్చుకుంటున్నారు. అనారోగ్య సమస్యలు, జ్వరాలతో ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. తక్షణ సహాయం అందించాలంటూ గ్రామ పెద్దలు భాడిస బాబు, సందా సుమన్‌తో పాటు గ్రామస్తులు ముక్తకంఠంతో జిల్లా కలెక్టర్‌ను వేడుకుంటున్నారు. ఫ్లడ్ డ్యూటీ అధికారులను అప్రమత్తం చేసి వెంకటాపురం మండల కేంద్రంలో సిద్ధంగా ఉంచిన పడవలను వినియోగించి లక్ష్మీపురం గ్రామానికి నిత్యావసరాలు, వైద్యసేవలు అందించా లని కోరుతున్నారు. వరద ప్రభావంతో దూరప్రాంతంలో చిక్కుకుపోయిన ఈ గిరిజన గ్రామానికి తక్షణ సహాయం అందించాలని ప్రజలు ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment