ఎన్నికల బూత్‌లెవెల్ అధికారులకు శిక్షణ
ములుగు ప్రతినిధి, జూలై4, తెలంగాణ జ్యోతి : జాతీయ స్థాయి ఎన్నికల బూత్ లెవెల్ అధికారులు (బీఎల్వోలు) శిక్షణ కార్యక్రమం ములుగు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో గురువారం నిర్వహించబడింది. ములుగు మండలానికి చెందిన 59 బీఎల్వోలు ఈ శిక్షణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల విధుల్లో బీఎల్వోలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పాటించాల్సిన మార్గదర్శకాలను రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఎన్. వెంకటేష్ వివరించారు. అధికారులు బీఎల్వోలు ప్రజలతో సమన్వయంతో పనిచేసి, ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో తహసిల్దార్ విజయభాస్కర్, ఎన్నికల డిప్యూటీ తహసిల్దార్ ఇమ్. నితీష్, మాస్టర్ ట్రైనర్ జీ. తిరుపతి, ఎన్నికల సీనియర్ అసిస్టెంట్ వి. మనోహర్, ఐటీ సపోర్ట్ శివ సాయిరాం, డీఈఓ రాజు, ఇతర సూపర్వైజర్లు పాల్గొన్నారు.