శాంతి నగరం గ్రామంలో విషాదం.
- వేడి నీటిలో పడిన బాలుడు.
- చికిత్స పొందుతూ మృతి.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం పట్టణ శివారు బీ.సీ మర్రిగూడెం జి.పి శాంతినగర్ ఆదివాసీ గ్రామంలో విషాదం చోటు చేసుకున్నది. ఈనెల 27వ తేదీన వేడి నీటి బకెట్లో పడగా రెండేళ్ల చిన్నారి దేవి ప్రసాద్ కు 80% చర్మం కాలి ఊడిపోయింది. పేద ఆది వాసి కుటుంబానికి చెందిన తల్లిదడ్రులు తాటిబధ్రు – లక్ష్మిలు కన్నీరు మున్నిరుగా విలపిస్తూ వెంకటాపురం ప్రభుత్వ వైద్య శాలకు తరలించారు. బాలుడు పరిస్థితి విషమంగా ఉండటం తో ములుగు, తదుపరి వరంగల్ ఎంజీఎం ప్రభుత్వ వైద్యశా లకు తరలించారు. మూడు రోజులు పాటు మృత్యువుతో పోరాడిన బాలుడు శుక్రవారం ఉదయం మృతి చెందారు. ఆడుతూ పాడుతూ ఉన్న చిన్నారి దేవి ప్రసాద్ మృతితో శాంతినగర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.