రెండు కార్లు ఢీ కొట్టుకోవడంతో ట్రాఫిక్ జామ్
– ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న కానిస్టేబుల్ ను ఢీ కొట్టిన బైక్
– ములుగు మండలం జంగాలపల్లి శివారులో ఘటన
ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : ఎదురెదురుగా రెండు కార్లు ఢీ కొట్టు కోవడంతో ములుగు మండలం జంగాలపల్లి శివారులో జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం ట్రాఫిక్ జామ్ అయింది. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగక పోగా కార్ల యజమానులు గొడవపడుతూ ఉండటంతో వాహనాలు నిలిచి పోయాయి. సంక్రాంతి సెలవుల్లో నేపథ్యంలో మేడారం తదితర టూరిస్ట్ ప్రాంతాలకు వెళ్లి తిరిగి వెళుతున్న ప్రయాణికులు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో అందిన సమాచారం మేరకు పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు వచ్చారు. ఇదే సందర్భంలో ఓ బైకిస్ట్ స్పీడ్ గా వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న కానిస్టేబుల్ రజనీకాంత్ ను ఢీకొట్టడంతో తీవ్ర గాయాలైనట్లు సమాచారం. స్థానికులు ఇచ్చిన సమాచారంతో 108 వాహనంలో బాధితుడిని ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఎస్సైలు వెంకటేశ్వరరావు, లక్ష్మారెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారు. ప్రమాదానికి కారణమైన వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.