ట్రాక్టర్ బోల్తా డ్రైవర్ మృతి
ములుగు, తెలంగాణ జ్యోతి :ములుగు జిల్లాలో బుధవారం ఉదయం ట్రాక్టర్ బోల్తా పడ్డ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. మంగపేట మండలం బుచ్చoపేట శివారు జబ్బోని గూడెం నుండి ఎర్ర మట్టి తరలిస్తున్న ట్రాక్టర్ తిరగబడడంతో ట్రాక్టర్ డ్రైవర్ ఎండి యాకూబ్ పాష అక్కడికక్కడే మరణించాడు. ఈ సంఘటన జరిగిన గంట తర్వాత ట్రాక్టర్ ప్రమాదాన్ని గుర్తించిన కొంతమంది మంగపేట పోలీసులకు సమాచారం అందిం చారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని మంగపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.