$ నేటి పంచాంగం $

నేటి రాశి ఫలాలు, పంచాంగం

$ నేటి పంచాంగం $

శ్రీ క్రోధి నామ సంవత్సరం పుష్య మాసం హేమంత ఋతువు దక్షిణాయణం

జనవరి 6, సోమవారము ఇందు వాసరః

సూర్యోదయం 6.34 AM

సూర్యాస్తమయం 5.36 PM

శుక్ల సప్తమి రా. 7.03 వరకు తదుపరి అష్టమి

నక్షత్రం ఉత్తరాభాద్ర రా. 8.25 వరకు తదుపరి రేవతి

కరణం : పరీఘ తె.3.19 వరకు తదుపరి బవ 

యోగం : గరజి ఉ.8.08 వరకు తదుపరి శివం

శుభ సమయములు : ఉదయం  5 : 46 నుండి 6.22 వరకు తిరిగి  సాయంత్రం 6:58 నుండి 7.22 వరకు

రాహుకాలం :  7:30 నుండి 9:00 వరకు

యమగండం : 10.30 AM- 12.00 PM

దుర్ముహూర్తం :  12.24 నుండి 1.12 తిరిగి 2.46 నుండి 3.34 వరకు

వర్ణము : 6.44 నుండి 8.15 వరకు

అమృత ఘడియలు : 4.51 నుండి 6.22 వరకు

                                         (06-01-2025) రాశి ఫలితాలు

మేషం : సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కార మౌతాయి. సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. దూరప్రాంతాల బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

వృషభం : ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం, వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు. చేపట్టిన పనులు ముందుకు సాగవు, దూర ప్రయాణాలు వలన శ్రమాధిక్యత పెరుగుతుంది. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆర్థిక విషయాలు నిరుత్సాహ పరుస్తాయి.

మిధునం : చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యా లలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి.

కర్కాటకం : విద్యార్థులకు నిరుత్సాహం తప్పదు. మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన మానసిక ప్రశాంతత ఉండదు. ఆరోగ్యం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.

సింహం : కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువు లతో వివాదాల పరిష్కారదిశగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగా లలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది.సన్నిహితుల నుండి శుభవార్తలు అవుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి.

కన్య: గృహమున చిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటా యి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి, వృత్తి, వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆర్ధిక విష యాలు సంతృప్తినిస్తాయి. విలువైన వస్తువులు బహుమతు లుగా పొందుతారు.

తుల : విద్యార్థుల ప్రయత్నాలు కొంత నిరాశ ఇస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నిరుద్యో గులకు ఒక వార్త ఊరట నిస్తుంది ఆర్థిక లావాదేవీలు మందగిస్తా యి. వృత్తి ఉద్యోగాలలో శ్రమ పెరుగుతుంది.

వృశ్చికం : ఇంటా బయట బాధ్యతలు మరింత పెరుగుతాయి. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు మానసిక సమస్యలు కలిగిస్తాయి. కుటుంబ వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు.

ధనస్సు : వ్యాపార,ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కనిపిస్తుం ది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

మకరం : సన్నిహితులతో విందువినోద కార్యక్రమాలలో పాల్గొం టారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగయీగం ఉన్నది. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన విధంగా ముందుకు సాగుతాయి. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. నూతన భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు.

కుంభం: కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగు తాయి. వృత్తి, వ్యాపారాలలో చికాకులు పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగ వాతావరణం సమస్యత్మకంగా ఉంటుంది.

మీనం : ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు తప్పవు. ఆర్థిక ఇబ్బందులుంటాయి. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు చికాకు పరుస్తాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. KM

వాస్తు జ్యోతిష్య పండితులు : రాజేష్ శర్మ

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment