ఎస్సీ ఎస్టీ కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి : కాటారం పోలీస్ స్టేషన్ పరిధిలో గల జాదరావుపేట గ్రామపంచాయతీ రఘుపల్లి కి చెందిన గోమాస పోష మల్లు అనే వ్యక్తిపై ఈనెల 12న అదే గ్రామానికి చెందిన ముగ్గురు రెడ్డి గాండ్ల కులానికి చెందిన వ్యక్తులు గొడవపడిన విషయంలో అతనిపై దాడి చేసి గొడ్డలితో తలపైన నరికిన విషయంలో ఈనెల 13న క్రైమ్ నెంబర్ 08/2024 గా పిఎస్ కాటారం నందు హత్యాయత్నం మరియు ఎస్సీ ఎస్టీ కేసు నమోదుచేయబడినది, ఇట్టి కేసులోని సాక్షులను విచారించి, దర్యాప్తు చేసిన కాటారం డిఎస్పి నిందితులైన వెన్నపురెడ్డి దామోదర్ రెడ్డి, వేమునూ రి వెంకన్న , వేమునూరి అరుణ్ కుమార్ అను ముగ్గురిని అరెస్టు చేసి శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు.