పరిపాలన చేయండంటే కమిషన్ల కొరకు వేంపర్లాడుతున్నారు 

పరిపాలన చేయండంటే కమిషన్ల కొరకు వేంపర్లాడుతున్నారు 

పరిపాలన చేయండంటే కమిషన్ల కొరకు వేంపర్లాడుతున్నారు 

– బిఆర్ఎస్ కార్యకర్త అంటే ఖతం కేసులు పెట్టుడే

– పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ప్రతి గ్రామంలో బిఆర్ఎస్ జెండా ఎగరాలి

– మన సభ ప్రభంజనం చూసి రేవంత్ రెడ్డి లాగు తడవాలి

– ఛలో వరంగల్ పోస్టర్ ఆవిష్కరణ

– భూపాలపల్లి మాజీ ఏమ్మెల్యే రమణా రెడ్డి

కాటారం, తెలంగాణ జ్యోతి : భూపాలపల్లి మండలం లోని కమలాపురం, నాగారం, అజాంనగర్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఏమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బం గా కమలాపురం గ్రామ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఛలో వరంగల్”* పోస్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో మాజీ ఏమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. ప్రజల్లో ఎంతో ఆదరణ, అభిమానం పొందిన వ్యక్తి కేసిఆర్ అని ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన చూసి ప్రజలు బాధపడుతున్నారని, కేసిఆర్ తెలంగాణ రాష్ట్రం కొరకు పార్టీ పెట్టిండు. అన్ని రాజకీయ పార్టీల ఉద్దేశ్యం వేరు కేసిఆర్ ఉద్దేశ్యం వేరని అన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి నీళ్ళ కాడ, నిధుల కాడ, ఉద్యోగ అవకాశాల కాడ ప్రతివిషయంలో అన్యాయం జరిగిందన్నారు. ఈ అన్యాయాలను ఎదురించాలి అంటే మన రాష్ట్రం మనకి కావాలి అని చాణుక్య రాజనీతితో, తన బుద్ది బలంతో ఆలోచన చేసి తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి తాను వేసే ప్రతి అడుగు తెలంగాణ రాష్ట్రం కొరకు వేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలందర్నీ ఏకం చేసిన బక్క పలుచని వ్యక్తి కేసి ఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు రాష్ట్రం తెచ్చిన పార్టీని గెలిపించి,తెలంగాణ సాధించిన కేసిఆర్ కు పట్టం కడితే కేసిఆర్ తనదైన శైలిలో 10 సంవత్సరాలు సుపరిపాలన చేశారని తెలిపారు. ప్రలోభాలకు లొంగిన ప్రజలు దొంగలకు పట్టం కట్టి అధికారం ఇస్తే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేయడం మరిచిపోయి కేసిఆర్ పైన, బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులపైన తిట్ల దండుకం చదువుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి నుండి కింది స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల లక్ష్యం ఒక్కటే బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టించి, జైలుకు పంపించడం, పరిపాలన చేతకాని వాళ్ళు ఎలా పరిపాలన చేయాలో కేసిఆర్ని అడిగితే ప్రతిపక్ష హోదాలో సలహాలు సూచనలు ఇస్తాం. ప్రభుత్వం ఎవరైనా, పార్టీ ఏదైనా మన లక్ష్యం ఒక్కటే అదే సంక్షేమం, అభివృద్ధి లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రజలకు పరిపాలన అందించడమే నని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ప్రజలు ఇప్పుడు ఆలోచిస్తున్నారు రాజనీతిజ్ఞుడుని వదులుకొని, కమిషన్లతో,ఆప్లికేషన్ల కలెక్షన్లతో పరిపాలించే వారికా మనం అధికారాన్ని ఇచ్చింది అని బాధపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఏర్పాటు ఆవిర్బవించిన భారత రాష్ట్ర సమితి పార్టీ ఈనెల 27న 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో వరంగల్ జిల్లా ఎల్కతుర్తి మండలం కేంద్రంగా రజతోత్సవ వేడుకలో భాగంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో ప్రతి ఒక్క కార్యకర్త పాల్గొనాలని, మన సభలోని జన ప్రభంజనం చూసి రేవంత్ రెడ్డి లాగు తడవాలని, ప్రతి కార్యకర్త సమయానికి సభ స్థలానికి చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలని అధిక సంఖ్యలో కార్యకర్తలు రావాలని వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు.

పరిపాలన చేయండంటే కమిషన్ల కొరకు వేంపర్లాడుతున్నారు 

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment