యువజన కాంగ్రెస్ నేత డబ్బులు తీసుకొని ఇబ్బంది పెడుతున్నాడు.

Written by telangana jyothi

Published on:

యువజన కాంగ్రెస్ నేత డబ్బులు తీసుకొని ఇబ్బంది పెడుతున్నాడు.

– పెట్రోల్ పోసుకొని దంపతుల ఆత్మహత్యాయత్నం

– ములుగు మండలం జీవంతరావుపల్లిలో ఘటన

ములుగు : కాంగ్రెస్ నాయకుడు 9ఏళ్ల క్రితం తనవద్ద నుంచి డబ్బులు తీసుకుని ప్లాటు, ఉద్యోగం ఇస్తామని చెప్పి మొహం చాటేసారని, తమను మానసికంగా, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందు లకు గురి చేస్తున్నాడని ములుగు మండలం జీవంతరావుపల్లి గ్రామానికి చెందిన దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఒంటి మీద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా యత్నం చేసుకుంటుండగా చుట్టుపక్కల వారు 100కు ఫోన్ చేయడంతో పోలీసులు స్పందించి వారికి నచ్చజెప్పారు. దంపతులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. జీవంతరావుపల్లి గ్రామానికి చెందిన నిగ్గుల సుధాకర్ 9 ఏళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రవి చందర్ కు ప్లాటు కొనుగోలు విషయంలో రూ.1.85వేలు ఇచ్చాడు. ప్లాటు చూపించ కుండా, డబ్బులు తిరిగి ఇవ్వకుండా తీవ్ర మనోవేదనకు గురి చేశాడని సుధాకర్ దంపతులు ఆరోపించారు. ఇటీవల పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించగా తనకు ఉద్యోగం ఇప్పిస్తానని, లేదంటే ప్లాటు ఇస్తానని చెప్పి దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నాడని అన్నారు. తన అనుచరు లతో బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. గత 40రోజులుగా రవిచందర్ ను కలవడానికి ప్రయత్నిస్తే పట్టించుకోవడంలేదని, మంత్రి సీతక్క, పోలీసులు తమ కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకున్నారు. తమ చావుతోనైనా ఇద్దరు పిల్లలకి న్యాయం జరుగుతుందనే ఆలోచనతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డామని పేర్కొన్నా రు. కాగా, విషయం తెలుసుకున్న ములుగు రెండో ఎస్ఐ రామకృష్ణ ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సుధాకర్ శారద దంపతులను వారించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now