ఆదివాసీ మారణ హోమాన్ని నిలిపివేయాలి

ఆదివాసీ మారణ హోమాన్ని నిలిపివేయాలి

ఆదివాసీ మారణ హోమాన్ని నిలిపివేయాలి

– మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలి.

కాటారం, జూలై 27, తెలంగాణ జ్యోతి :  ఆదివాసి మరణ హోమాన్ని ఆపరేషన్ అగర్ను నిలిపి వేసేందుకు మావోయిస్టుల తో వెంటనే కేంద్ర ప్రభుత్వం బెక్షరతుగా చర్చలు జరపాలని ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక డిమాండ్ చేసింది. మధ్య భారతంలో ఆపరేషన్ కగార్ తో సాగుతున్న ఆదివాసుల హననానికి వ్యతిరేకంగా ఆదివారం కాటారం మండల కేంద్రం లోని అయ్యప్ప కల్యాణ మండపంలో ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక బహిరంగ సభ నిర్వహించారు. కన్వీనర్ మడిమడుగుల మల్లన్న అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్క నారాయణ రావు మాట్లాడుతూ 1996 పేసా చట్టం, 2006 అడవి హక్కుల చట్టాన్ని అమలు పరచకుండ నరమేధాన్ని కొనసాగిస్తూ ఆదివాసీల ఉద్యమాలకు నిశ్శబ్దం చేసి వనరులను కార్పొరేట్ లకు అందించడానికి చేస్తున్న మోడీ, అమిత్ షా చేస్తూన్న ఆర్థిక విధానాలను ఖండించారు. గత పదిహేను నెలల కాలంలో 600 మంది అమాయక ప్రజలను బూటకపు ఎన్ కౌంటర్ పేరిట చంపారని ఆరోపించారు. వేదిక కో ఆర్డినేటర్ ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ మాట్లాడుతూ ఆదివాసీ అడవి ప్రాంతంలో సైన్యాన్ని దింపడం కోసం, వనరులను రవాణా చేయడం కోసం రోడ్డును నిర్మించి ఇదే అభివృద్ధి అని ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. ఇది ఆదివాసీలా అభివృద్ధి కి ఎలాంటి ఉపయోగం లేదని కనీసం వారికీ సైకిల్ లు కూడా లేవని అన్నారు. అంతే కాకా భేటీ బచావో భేటీ పడావో అని నినాదం ఇస్తూ అడవిలో ఆడబిడ్డలను చంపుతున్నారని అన్నారు. మావోయిస్టు పార్టీ తో తప్పనిసరిగా చర్చలు జరిపి ఉద్యమకారుల, ఆదివాసుల జీవించే హక్కులను కాపాడాలని, అంతేకాకుండా మావోయిస్టు పార్టీ చర్చలకు సిద్దమని ప్రకటించినందున కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి శాంతి చర్చలు జరిపి ఆదివాసుల జీవించే హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. సభలో చేసిన తీర్మానాలు  ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలి,ఆదివాసీల మరణాహోమాన్ని నిలిపివేయాలి, కాల్పుల విరమణ పాటించి, చర్చలు జరపాలి, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించి, పర్యావ రణాన్ని, అటవీ సంపదను కాపాడాలి. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ నాగ భూషణం, పి డి ఎం రాష్ట్ర కార్యదర్శి చంద్రమౌళి,సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామెర తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్, వేదిక కో కన్వీనర్ మర్వాడీ సుదర్శన్,వరంగల్ సి ఎల్ సీ కార్యదర్శి సారంగపాణి,బహుజన సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు తగరం శంకర్ లాల్, ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక నాయకులు ఐతే బాపు, బాలసాని రాజయ్య, గుమ్మడి కొమురయ్య, రామిల్ల బాపు టి.రత్నకుమార్, తాళ్లపల్లి లక్ష్మణ్, తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు సుంకరి మల్లేష్,గడ్డం లక్ష్మణ్,ఎరుకల రాజన్న, పొన్నం రాజమల్లయ్య,నారా వినోద్, దుర్గం నగేష్, రైతు కూలి, స్వామి సంఘం నాయకులు ఎల్. భీమన్నా, తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి పార్వతక్క,మంచిర్యాల జిల్లా కార్యదర్శి జైపాల్ సింగ్. యువైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు. తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment