ప్రతిష్టాత్మకంగా రాజీవ్ యువ వికాస పథకం

ప్రతిష్టాత్మకంగా రాజీవ్ యువ వికాస పథకం

– జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

కాటారం, తెలంగాణ జ్యోతి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ వికాస పథకం సద్వినియోగం చేసుకోవాలని ఈనెల 14వ తేదీతో ప్రక్రియ ముగుస్తుందని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. గురువారం కాటారం ఎంపిడిఓ కార్యాలయంలో రాజీవ్ యువ వికాసం దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. రాజీవ్ యువ వికాసం దరఖాస్తులు వివరాలు తప్పనిసరిగా రిజిస్టర్ లో నమోదు చేసి, దరఖాస్తు దారునికి రశీదు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి ఆన్లైన్, ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరణ పకడ్బందీగా చేపట్టాలని అన్నారు. రాజీవ్ యువ వికాసం దరఖాస్తులు తీసుకోవడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ ను పరిశీలించారు. పథక యూనిట్లు వివరాల ఫ్లెక్సీ ఏర్పాటుతో హెల్ప్ డెస్క్ ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని ఎంపిడిఓను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా భూపాలపల్లి మున్సిపల్ కార్యాలయం, అన్ని ఎంపిడిఓ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ లలో నేరుగా దరఖాస్తులు కూడా ఇవ్వొచ్చని తెలిపారు. దరఖాస్తులు ఉచితం గా ఇవ్వబడతాయని తెలిపారు. దరఖాస్తుదారులు ఆధార్, రేషన్ కార్డ్ లేదా ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రంతో కలిపి దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి దరఖాస్తును రిజిస్టర్ లో నమోదు చేసి తప్పనిసరిగా రశీదు ఇవ్వాలని ఆదేశించారు. ఆన్లైన్ చేసిన దరఖాస్తు దారుని నుండి దరఖాస్తు తీసుకుని భద్రపరచాలని సూచించారు. దరఖాస్తులు జాగ్రత్తగా భద్రపరచాలని ఏ ఒక్కటి మిస్ కావొద్దని తెలిపారు. ఇప్పటి వరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఒక్కొక్క సామాజిక వర్గానికి విడివిడిగా రిజిస్టర్ లోవివరాలు నమోదు చేసి దరఖాస్తుదారులకు రశీదు ఇవ్వాలని స్పష్టం చేశారు.రాజీవ్ యువ వికాసం పథకంలో 50 వేల నుంచి 4 లక్షల రూపాయలు వరకు సబ్సిడీ యూనిట్లు ఏర్పాటుకు అవకాశం ఉందని తెలిపా రు. ఈ నెల 14వ తేదీ వరకు మాత్రమే దరఖాస్తు చేసేందుకు అవకాశం ఉన్నందున విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు. వ్యవసాయేతర యూనిట్లకు 21 నుంచి 55 సంవత్సరాలు, వ్యవ సాయ యూనిట్లకు 21 నుండి 60 సంవత్సరాల వయసున్న వారు అర్హులని తెలిపారు. ఎంపిడిఓ కార్యాలయంలో సిబ్బంది కొరత ఉన్నట్లు గమనించిన జిల్లా కలెక్టర్ సిబ్బంది ఖాళీల వివరాలు అందచేయాలని ఎంపిడివోను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ఎంపిడిఓ బాబు, డిటి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

[metaslider id="19893"]

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment