2023 నాటి పిఆర్సి అమలు చేయాలి
విశ్రాంతి ఉద్యోగుల సంఘం డిమాండ్
వెంకటాపురం, నూగూరు, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ అతిథిగృహంలో గురువారం జరిగిన సమావేశంలో ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘం వెంకటాపురం యూనిట్ 2023 నాటి పిఆర్సి అమలు చేయాలని, అన్ని వైద్యశాలల్లో ఆరోగ్య సేవలు కల్పించాలని, పెండింగ్‌లో ఉన్న అన్ని డిమాండ్లను ఆమోదించాలని ప్రభుత్వాన్ని కోరింది. సమావేశానికి యూనిట్ అధ్యక్షులు కాల్వ సుందర్రావు అధ్యక్షత వహించగా, జిల్లా అధ్యక్షులు జి. సారయ్య, ప్రధాన కార్యదర్శి రామ్మూర్తి, రిటైర్డ్ వాజేడు ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ తిరుపతి రెడ్డి తదితరులు హాజరయ్యారు. విశ్రాంతి ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు సంఘం కృషి చేస్తోందని నాయకులు తెలిపారు. అనంతరం ఆదాయం, వ్యయాలు సమీక్షించి ఆమోదించడంతో పాటు 2025–2028 సంవత్స రాలకు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాల్వ సుందర్రావు అధ్యక్షుడిగా, కే.ఎల్.ఎన్. ఆచార్యులు కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఎన్నికైన కొత్త కమిటీని ఘనంగా సన్మానించి నట్లు సంఘం ప్రకటనలో తెలిపింది. సమావేశానికి వంద మందికి పైగా విశ్రాంతి ఉద్యోగులు హాజరయ్యారు.