ప్రజల ఆశీర్వాదంతో టిపిసిసిలో ప్రధాన కార్యదర్శి పదవి
– దుద్దిల్ల శ్రీను బాబు
కాటారం, జూన్ 23, తెలంగాణ జ్యోతి : మంథని నియోజక వర్గంలో ప్రజలకు సేవ చేసినందుకు రాష్ట్రస్థాయిలో కాంగ్రెస్ అభివృద్ధికి పాటుపడాలని సీఎం రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ల కోరిక మేరకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పదవి స్వీకరించినట్లు దుద్దిళ్ల శ్రీనుబాబు తెలిపారు. సోమవారం భూపాలపల్లి నుండి కాటారం వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. మేడిపల్లి గ్రామం నుండి కాటారం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. గారేపల్లి కూడలిలో అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలదండలు వేసి నివాళులర్పిం చారు. మంథని నియోజకవర్గంలో పదవి లేకుండా ప్రజలకు అన్ని రకాలుగా సేవలు అందించాలని ఇకముందు ప్రధాన కార్యదర్శి పదవితో మరింత సేవ చేసేందుకు కృషి చేస్తానని స్వర్గీయ శ్రీపాదరావు, మంత్రి శ్రీధర్ బాబు సోదరుని అండ దండలతో వాళ్ల ఆశయ సాధనకు కృషి చేస్తానని శ్రీనుబాబు పేర్కొన్నారు. మహా ముత్తారం కాటారం భూపాలపల్లి మండలా లకు చెందిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు శీను బాబుకు ఒక్కొక్కరుగా శాలువాతో సత్కరించి పూలమాలలు వేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అయిత ప్రకాష్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు, మాజీ ఎంపీపీ సంతకాని సమ్మయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వేమునూరు ప్రభాకర్ రెడ్డి, మంథని నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చీమల సందీప్, మండల శాఖ అధ్యక్షుడు చిటూరి మహేష్, నాయకులు నవీన్ రావు, దేవేందర్ రెడ్డి, నాయిని శ్రీనివాస్,కొట్టే శ్రీహరి, కొట్టే శ్రీశైలం, బెల్లంకొండ రామన్న, కామిడీ వెంకటరెడ్డి,చీమల రాజు, పసుల మొగిలి వివిధ గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.