ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీసు శాఖ కృషి చేయాలి

ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీసు శాఖ కృషి చేయాలి

ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీసు శాఖ కృషి చేయాలి

– భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే 

భూపాలపల్లి, జూలై 7, తెలంగాణ జ్యోతి : జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే  మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీసులు బాధ్యతతో వ్యవహరించాలని అన్నారు. ప్రజావాణికి వివిధ సమస్యలతో వచ్చిన 18 మంది బాధితులను స్వయంగా కలిసి వారి ఫిర్యాదులను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులను వెంటనే విచారణ చేపట్టి, బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు భయభ్రాంతులు లేకుండా, మూడో వ్యక్తి మధ్యవర్తిత్వం లేకుండా, పైరవీలకు లోనుకాకుండా స్వచ్చందం గా పోలీసు సేవలను వినియోగించుకొని తమ సమస్యలను చట్టబద్ధంగా పరిష్కరించుకోవాలని సూచించారు. కేసుల పరిష్కారంలో ఆలస్యం జరగకుండా వీలైనంత త్వరగా న్యాయం అందించాలని పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment