ప్రజలను మోసం చేస్తున్న మోడీ పాలనకు బుద్ది చెప్పాలి
– ప్రజా సంఘాల డిమాండ్
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి : మోడీ ప్రభుత్వం నేడు కులం పేరు తోటి మతం పేరు తోటి ప్రజలను విభజిస్తూ ప్రజల మధ్య చిచ్చు పెడుతుందని శుక్రవారం కాటారంలో పత్రికా విలేకరుల సమావేశంలో ప్రజాసంఘాల నాయకుడు అక్కల బాపు అన్నారు. దేశ సంపదను కార్పొరేట్ వ్యవస్థకు అప్పగిస్తుందన్నారు. దేశంలో యూనివర్సిటీల కోసం బడిల కోసమో బడ్జెట్ కేటాయించడం లేదన్నారు. గుల్లకు గోపురాలకు విగ్రహాలకు వందల కోట్ల రూపాయలు ప్రజల దనం కేటాయిస్తుందన్నారు. మరో ప్రక్క పేద ప్రజలు తిండి లేక ఉద్యోగాలు లేక రైతులకు గిట్టుబాటు ధర లేక కార్మికులకు కనీస వేతనాలు లేక మహిళలకు రక్షణ లేక అతలాకుతలమవుతుంటే అయోధ్యలో రామ మందిరం అని రాజ్యాంగా నికి విరుద్ధంగా రాజకీయాలు నడిపిస్తున్నారన్నారు. మోడీ ప్రధాని అంబానీ బడాబడా కార్పొరేటు సమస్యలకు మన ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా తాకట్టు పెడుతున్నారు పెద్ద ఎత్తున ప్రజలు ప్రజాస్వామ్యవాదులు వాస్తవాల పైన పోరాటాలు చేయవలసిన అవసరం ఉందన్నారు. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా కేవలం మత విద్వేషాలు రేపుతూ 10 సంవత్సరాల పాలన కొనసాగించిందన్నారు. రాబోయే ఎన్నికల్లో మోడీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పవలసిన అవసరం ఉందన్నారు. కార్యక్ర మంలో ప్రజాసంఘాల నాయకులు పీక కిరణ్ శంకర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.