పాలెం ప్రాజెక్టు ప్రధాన కాలువకు గండి పడే ప్రమాదం
- పట్టించుకోని ప్రాజెక్టు అధికారులు
- గంట గంటకు పెరుగుతున్న బుంగ
వెంకటాపురం, జులై24, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలెం ప్రాజెక్టు ప్రధాన కాలువకు, వాజేడు మండలం బొల్లారం గ్రామం వద్ద కాలువకు పెద్ద బుంగ పడి గంట గంటకు బుంగ పెరుగుతూ నీరు బయటకు పోతున్నది. బొల్లారం గ్రామ ఆదివాసి రైతులు రంద్రంకు ఇసుక బస్తాలు వేసిన భారీ వర్షాలు కారణంగా నీరు పెరిగి బుంగ వైశాల్యం పెరుగుతూ స్పీడ్ గా నీరు బయటకు వెళ్ళిపోతున్నది. దీంతో మట్టికూలి భారీ గండి పడే అవకాశం ఉందని ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం పాలెం ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులకు, ప్రాజెక్టు లస్కర్ కు తెలియపరిచిన పట్టించుకోవటం లేదని లేదన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 10 వేల ఎకరాలకు సాగునీరు అందించే పాలెం ప్రాజెక్టు ప్రధాన కాలువ గండి పడే ప్రమాదం ఉందని, వెంటనే అధికారులు స్పందించి గండి పడకుండా రంద్రం పూడ్చే చర్యలు తీసుకోవాలని, పాలెం ప్రాజెక్ట్ ఆయకట్టు రైతాంగం ములుగు జిల్లా కలెక్టర్ ను కోరుతున్నారు.