మహాత్మగాంధీ, అంబేద్కర్ సిద్ధాంతాలే దేశానికి శ్రీరామరక్ష

మహాత్మగాంధీ, అంబేద్కర్ సిద్ధాంతాలే దేశానికి శ్రీరామరక్ష

మహాత్మగాంధీ, అంబేద్కర్ సిద్ధాంతాలే దేశానికి శ్రీరామరక్ష

– కాంగ్రెస్ పార్టీ నాయకులు పంచ రెడ్డి చరణ్

నిజామాబాద్ ప్రతినిధి తెలంగాణ జ్యోతి: మహాత్మా గాంధీ అంబేద్కర్ సిద్ధాంతాలే దేశానికి శ్రీరామరక్ష అని కాంగ్రెస్ పార్టీ నాయకులు పంచ రెడ్డి చరణ్ అన్నారు. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్రలో భాగంగా జాతీయ కాంగ్రెస్ పిలుపుమేరకు ఆర్మూర్ నియోజకవర్గం లోని డొంకేశ్వర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూమేష్ రెడ్డి ఆధ్వర్యంలో నూత్ పల్లి, నడ్కుడ, ,చిన్న యానం, గాదేపల్లి గ్రామాలలో నిర్వహించిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్రలో డొంకేశ్వర్ మండల ఇంచార్జ్ పంచరెడ్డి చరణ్ సమక్షంలో పాదయాత్ర నిర్వహించారు. ఆయా గ్రామాల ప్రధాన కూడళ్లలో కార్యకర్తలతో ప్రతిజ్ఞ నిర్వహించారు.ఈ సందర్భంగా పంచ రెడ్డి చరణ్ మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా బిజెపి పాలనలో దేశం 50 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందని 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలన లో దేశంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని కాంగ్రెస్ పార్టీ సాధించిన అభివృద్ధిని కొనసాగించడం చేతకాక మతం పేరుతో బిజెపి రాజకీయం చేయాలని చూస్తుందని ఆయన అన్నారు. స్వాతంత్రం కోసం శాంతియుతంగా సత్యం అహింసా పద్ధతిలో దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి అహర్నిశలు శ్రమించిన మహాత్మా గాంధీ ని కించపరచడమే కాకుండా రాజ్యాంగ నిర్మాత దేశంలో ప్రతి పౌరునికి సమాన హక్కులు స్వేచ్ఛ సమానత్వం సౌబ్రాతృత్వం కల్పించి వారికి ఆర్థిక రాజకీయ సామాజిక స్వేచ్ఛ కల్పించి దేశంలో అసమానతలను రూపుమాపిన మహనీయుడు అంబేద్కర్ ని కించపరచడమే ఎజెండాగా పెట్టుకుందని, బిజెపి పార్టీకి ఇలాంటి విద్వేష భావజాలం ఉన్నది కాబట్టే అభివృద్ధి చేయలేక ఉద్దేశంతో రాజకీయం చేయాలని చూస్తుందని అందుకే మహనీయులైన మహాత్మా గాంధీ,అంబేద్కర్ పై విషం చిమ్ముతుందని ఆయన మండిపడ్డారు. బిజెపి ఎన్ని కుట్రలు చేసినా మహాత్మా గాంధీ, అంబేద్కర్ త్యాగాలను సేవలను వారి ఆలోచన విధానాలను సిద్ధాంతాలను దేశ ప్రజలు మర్చిపోరని వారి సిద్ధాంతాలను ఆలోచన విధానాలను ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్తుందని ఆయన అన్నారు. సకల సబ్బండ వర్గాల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని భవిష్యత్తులో రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పాలన కొనసాగుతుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో డొంకేశ్వర్ యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుమన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంగారెడ్డి, బోజారెడ్డి, వైయస్ గంగాధర్ , మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు స్రవంతి , సంజీవ్ భూమన్న భోజన్న చిన్నారెడ్డి చిలుక శ్రీనివాస్ గణేష్ భరత్ లతో పాటు నూత్ పల్లి, నడ్కుడ, ,చిన్న యానం, గాదేపల్లి గ్రామాల ముఖ్య కాంగ్రెస్ నాయకులతో పాటు యూత్ కాంగ్రెస్,ఎన్ ఎస్ యు ఐ నాయకులు,అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment