ప్రజల కడుపు నింపేందుకే సన్న బియ్యం చారిత్రాత్మక పథకం 

ప్రజల కడుపు నింపేందుకే సన్న బియ్యం చారిత్రాత్మక పథకం 

ప్రజల కడుపు నింపేందుకే సన్న బియ్యం చారిత్రాత్మక పథకం 

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు

కాటారం, ఆగస్ట్ 11,తెలంగాణ జ్యోతి : పేద ప్రజలు కడుపు నిండా నాలుగు ముద్దలు తినాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సన్న బియ్యం పంపిణీ చేస్తుందని రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. సోమవారం కాటారం మండల కేంద్రంలోని బిఎల్ ఎం గార్డెన్ లో కాటారం డివిజన్ పరిధిలోని మండలాల ప్రజలకు నూతన రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడు తూ గత ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల కాలం పాటు పేద కుటుంబానికి ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు లేవని అన్నారు.  మన ప్రభుత్వం మార్పు కోరుతావున్నదని, అందుకే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో 277 రేషన్ దుకాణాల ద్వారా అలాగే కాటారం డివిజన్ లోని 101 దుకాణాల ద్వారా నిరుపేదలకు సన్న బియ్యం ఇస్తున్నామని తెలిపారు. జిల్లాలో 60,438 మంది నూతన కుటుంబ సభ్యులు జత చేయడం ద్వారా ప్రతి నెలా 362 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం ఇస్తున్నామని తెలిపారు. ఈ పథకం పేదవారి జీవితాల్లో మార్పు తెచ్చే పదకమని తెలిపారు. పేద ప్రజల జీవితాల్లో ప్రభుత్వం మార్పు కోరుకుంతుందని తెలిపారు. జిల్లాలో రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ నడుస్తున్నామని, గత ప్రభుత్వంలో బిల్లు కట్టక పోతే కనెక్షన్ కట్ చేశారన్నారు.పేద కుటుంబానికి ఇబ్బంది జరగ కూడదని ప్రభుత్వం ఏర్పాటు కాగానే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. గృహ జ్యోతి పథకం కింద 52 వేల కుటుంబాలకు 26 కోట్లు రూపాయలు సబ్సిడీ ప్రభుత్వం మంజూరు చేసి నట్లు తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు కాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని మన్నారు. ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం చేపట్టి అందిస్తామని  విడతల వారిగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ రెండు పడక గదుల ఇండ్లు ఇస్తామని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి మొదటి దశలో 3500 ఇండ్లు మంజూరు చేశామని, రానున్న రోజుల్లో ఇంటి స్థలం లేని వారికి ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు. రైతు భరోసా పథకం కింద 9 రోజులలో 9 వేల కోట్లు ఇచ్చామని,  2 లక్షల రూపాయల వ్యవసాయ రుణం మాఫీ చేశామని, 75 వేలు కోట్ల రూపాయలు రైతు సంక్షేమానికి ఖర్చు చేశామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం అప్పులు చేసిన రాష్ట్రాన్ని సంక్షేమ వైపు నడిపిస్తున్నామని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. రాబోయే రోజుల్లో ప్రజల ఆశీర్వాదం ఈ ప్రభుత్వానికి ఉండాలని సూచించారు. ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోముందుకు తీసుకు వెళతామని తెలిపారు. విద్యా వ్యవస్థను సైతం బలోపేతం చేస్తూ ఈ ప్రాంత విద్యార్థులకు 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మించబోతున్నామని తెలిపారు. దేశ స్థాయిలో ఘన కీర్తి కలిగించేలా సరస్వతి పుష్కరాలు నిర్వహించామన్నారు. ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలి. మా నాన్న శ్రీపాదరావు  ఆశయ సాధనకు కృషి చేస్తున్నామని వివరించారు. ఈ ప్రాంత మహిళలకు, యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో మేం పని చేస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ లో రేషన్ డీలర్లు ఒక్క కేజీ కూడా తూకంలో తక్కువ కాకుండా పంపిణీ చేయాలని, ప్రభుత్వం మీ సమస్య తీరుస్తుందని తెలి పారు. ప్రజా సేవలు అధికారులు ప్రజల మన్ననలు పొందాలని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, డీఎస్ఓ కిరణ్ కుమార్, విద్యుత్ శాఖ ఎస్ ఈ మల్సూర్ నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమల, పి ఎస్ సి ఎస్ చైర్మన్లు ప్రశాంత్, మొండయ్య, ఉపాధి హామీ పథకం రాష్ట్ర మెంబర్ రమేష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు తదితరులు పాల్గొన్నారు.

ప్రజల కడుపు నింపేందుకే సన్న బియ్యం చారిత్రాత్మక పథకం 

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment