గ్రామపంచాయతీ 16 గుంటల భూమి కబ్జా నుంచి విముక్తి చేయాలి
మండల కార్యాలయాల ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ నిర్మాణం చేపట్టాలి
మల్లంపల్లి, మార్చి17, తెలంగాణజ్యోతి : మల్లంపల్లి గ్రామపంచాయతీకి చెందిన 16 గుంటల భూమిని కోర్టు తీర్పు మేరకు కబ్జా నుంచి విముక్తి చేసి తిరిగి గ్రామపంచాయతీ పరిధిలోకి తీసుకోవాలని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. అలాగే మండలంలోని అన్ని కార్యాలయాలను ఒకే చోట ఏర్పాటు చేసేందుకు ఇంటిగ్రేటెడ్ భవనం నిర్మించాలని కోరుతూ తహసీల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు. పది గ్రామాల ప్రజలకు సౌకర్యంగా ఉండేలా ఒకే ప్రాంగణంలో మండల ఆఫీసులు ఏర్పాటు చేసి, శాశ్వత భవనాలను నిర్మించాలని వారు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.






