పేదలందరికీ సన్న బియ్యం అందించడమే ప్రభుత్వ సంకల్పం
– ధనవంతుల బియ్యం…పేదోడికి సాయం
– రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరిస్తాం
– కాంగ్రెస్ హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు
– సన్న బియ్యం పంపిణీని ప్రారంభించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు
కాటారం,తెలంగాణ జ్యోతి : ఆహార భద్రత కార్డుదారులందరికీ సన్న బియ్యం అందించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగా హామీని నెరవేర్చినట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం కాటారం సబ్ డివిజన్ కేంద్రంలో కాటారం, మలహర్, మహాదేవపూర్, పలిమెల, మహా ముత్హారం మండలాల కు సన్నబియ్యం పంపిణీని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లా అధికారులతో కాటారంలో ప్రారంభించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఒకటి తర్వాత ఒకటి అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక వ్యవస్థ గాడి తప్పినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి, నేటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సంకల్పంతో పేద ప్రజలకు కడుపు నిండాలే.. పేద ప్రజలు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఎన్నికలలో ప్రజలు ఉత్సాహంతో ఇచ్చిన తీర్పు, ఆశీర్వాదంతో ప్రజలకు మేలు చేయాలనే తపనతో ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు కృషి చేస్తోందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఒక కుటుంబంలో ఒక్కో సబ్యునికి ఆరు కిలోల చొప్పున 4గురున్న సభ్యులకు 24 కిలోలు ప్రభుత్వం ఉచితంగా సన్నబియ్యం సుమారు రూ1400 విలువ కుటుంబానికి ఆదా జరుగుతుం దన్నారు. ధనికులే కాకుండా పేద ప్రజలు తమ బియ్యం తినాలని ఆకాంక్ష నెరవేరిందని లబ్ధిదారులు సంతోషంగా ఉన్నారని శ్రీధర్ బాబు వివరించారు. దేశంలోనే సన్న బియ్యం పథకం అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గత ప్రభుత్వ హయాంలో దొడ్డు రకం బియ్యం రీసైక్లింగ్ తో ప్రభుత్వానికి పదివేల కోట్లు నష్టం వాటిల్లడం, రూ 3 నుండి 4 వేల కోట్లు ప్రభుత్వంపై అదనపు భారం పడుతున్న భరిస్తూ ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.
సన్న వడ్ల రకానికి బోనస్
పేద ప్రజల అభివృద్ధి కై ఖరీఫ్ సీజన్లో సన్న వడ్ల ఉత్పత్తికి కోసం రైతులకు రూ 500 చొప్పున బోనస్ ఇచ్చామని తెలిపారు. కాలేశ్వరం ప్రాజెక్టు తోటే రాష్ట్రంలో పెద్ద ఎత్తున వరి పంట పండినట్లు ఆరోపించారని, ఆ ప్రాజెక్టు కూలిపోయిన తర్వాత రికార్డు స్థాయిలో 156.78 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగిందన్నారు. బిఆర్ఎస్ పాలనలో రైతుల కు ఖరీఫ్ సీజన్లో రూ 10,400 కోట్లు చెల్లిస్తే 2024 ఖరీఫ్ సీజన్లో రూ 12,511 కోట్లు చెల్లించామన్నారు. బిఆర్ఎస్ మాటలతో కాలం గడిపినట్లు రైతులకు గత ప్రభుత్వం ఎప్పుడు బోనస్ ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వం రూ 2 వేల కోట్లు బోనస్ చెల్లించినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
రేషన్ డీలర్ల సమస్యల కు పరిష్కారం
తెల్ల రేషన్ కార్డుదారులందరికీ అన్న బియ్యం పంపిణీ చేయాల ని అధికారులు నిగా ఉంచాలని ఎలాంటి అవకతవకలు ఉండ వద్దని మంత్రి అన్నారు. రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించేం దుకు ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో రేషన్ డీలర్ల పాత్ర ముఖ్యమైనదని, పంపిణీ లో ఎలాంటి తప్పులు జరగ కుండా సక్రమంగా పనిచేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంద ని శ్రీధర్ బాబు తెలిపారు
వాగ్దానాల అమలుకు పారిపోవడం లేదు
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొ క్కటిగా అమలు చేస్తున్నట్టు పారిపోవడం లేదని మహాలక్ష్మి పథకం, గృహజ్యోతి, వ్యవసాయానికిఉచిత కరెంటు, రూ 500 లకే సిలండర్, సన్న బియ్యం పంపిణీ, యువతి యువకులకు ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. మంథని నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ పథకంలో గృహ నిర్మాణాలు చేస్తామని నిరుపేదలకే గృహాలు మంజూరు చేయాలని ఎలాంటి పైరవీలకు అవకాశం ఇవ్వకుండా అర్హులైన వారిని ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మను మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు.ఈ కార్యక్ర మంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్,పౌర సరఫరాల అధికారి శ్రీనాద్, పౌర సరఫరాల డిఎం రాములు, మండల ప్రత్యేక అధికారి, డిఆర్డీఓ నరేష్, పరిశ్రమల శాఖ జిఎం సిద్దార్థ, కాటారం డివిజన్ మండలాల తహసీల్దార్లు, ఎంపిడివోలు, రేషన్ శాప్ డీలర్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు.