పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

– రైతు సంఘం మండల కమిటీ అధ్యక్షుడు వడకాపురం సారయ్య

ఏటూరునాగారం, ఆగస్టు 21, తెలంగాణ జ్యోతి : గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మండలంలోని వాగులు, చెరువులు ఉప్పొంగి పలు గ్రామాల్లో పంటలు దెబ్బ తిన్నాయని తెలంగాణ రైతు సంఘం మండల కమిటీ అధ్యక్షుడు వడకాపురం సారయ్య తెలిపారు. పంట నష్ట పోయిన రైతులను ప్రభుత్వం తక్షణం గుర్తించి ఆర్థిక సహాయం అందించాలని  డిమాండ్ చేశారు. సారయ్య మాట్లాడుతూ  పెద్ద వెంకటాపురం శివారు వాగు సరిహద్దులోని చిన్నబోయినపల్లి గ్రామానికి చెందిన మహిళా రైతు దోమ్మని రాజేశ్వరి 8 ఎకరాలు, తిప్పని రజనీకాంత్ 6 ఎకరాలు కౌలుకు తీసుకుని పంట వేసినా వర్షాల వలన వాగు ఉప్పొంగి పూర్తిగా నష్టపోయాయని పేర్కొన్నారు. శివాపురం, గోగుపల్లి రైతులూ ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఒక్కో ఎకరానికి రైతులు సగటున ₹25 వేల రూపాయల పెట్టుబడి పెట్టారు. కనీసం పెట్టిన ఖర్చులు వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం అందించాలని సారయ్య ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో కాట్రపల్లి యాకూబ్, గంట సంతోష్ రెడ్డి, శ్రీరామ్ రవి, కుంభం లక్ష్మయ్య, మరిశెట్టి సైదులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment