కుమ్మరి నాగేశ్వరరావు ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి
-తహసీల్దార్ ఎంపీడీఓ పైన చర్యలు తీసుకోవాలి
– డా జాడి రామరాజు నేత
తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం : బీజేపీ మండల అధ్యక్షురాలు మాజీ సర్పంచ్ దుర్గం సమ్మక్క ఆధ్వర్యంలో బుట్టాయి గూడెం గ్రామంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహిం చారు.ఈ సమావేశం కు ముఖ్య అతిథిగా బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి డా. జాడి రామరాజు నేత హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజాపాలన పేరుతో గ్రామాల ఓట్లను పరిగణలోకి తీసుకొని ఇండ్లు మంజూరు చేసినట్టు గ్రామాలలో సమావేశం ఏర్పాటు చేసుకొని, ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నట్టు ప్రకటించడం వలన కుమ్మరి నాగయ్య ఆత్మయత్నం చేసుకోవడానికి ప్రభుత్వం కారణం కాబట్టి భాద్యత వహించాలని అన్నారు. స్థానిక ఎం ఆర్ ఓ, ఎంపీడీఓ పైన చర్యలు తీసుకోవాలని కోరారు. నాగయ్య కుటుంబానికి 25లక్షల ఇవ్వాలని అన్నారు. ఇప్పటికైనా ప్రజలు మేధావులు ఆలోచించండి. ఆదివాసీ దళిత బహుజన వర్గాలప్రజలకు రాజ్యాధికారమే లక్ష్యాంగా నాయకురాలు పోరాటం చేసిన పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రికీ చిత్త శుద్ధి ఉంటే గ్రామసభలో చదివిన ఇందిరమ్మ ఇండ్లు ఎప్పటివరకు వస్తాయో చెప్పాలని అన్నారు. ఇప్పటికైనా ఆదివాసీ దళిత బహుజన వర్గాల ప్రజలు అవినీతి అక్రమాలు భూకబ్జాలు చేసి గొడవలు సృష్టించి రక్షానందం పొందే కాంగ్రెస్ తెరాస నాయకులు ములుగు నియోజకవర్గ ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు అవసరమా అని బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి డా జాడి రామరాజు నేత అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి కుమ్మరి సత్యం, మహిళ మోర్చా అధ్యక్షురాలు పానుగంటి సంగీత, మండల యువమోర్చ అధ్యక్షులు జనగాం ఆనంద్, దళిత మోర్చా అధ్యక్షులు సునార్కని లక్ష్మయ్య, కావేరి ఆనంద్, సమ్మయ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.