బీజేపీతోనే దేశాభివృద్ధి : జిల్లా అధ్యక్షుడు బలరాం
ములుగు, నవంబర్ 17, మేజర్ న్యూస్ సూర్య : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతోనే దేశాభివృద్ధి సాధ్యమని ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అన్నారు. సోమవారం ములుగులోని పార్టీ జిల్లా కార్యాలయంలో మండల అధ్యక్షుడు రాయంచు నాగరాజు ఆధ్వర్యంలో నేస్తం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు నక్క రాజు సమక్షంలో 50మంది బీజేపీలో చేరగా కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో దేశం నాలుగో అతిపెద్ద జీడీపీ కలిగిన దేశంగా వెలుగొందనుందన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతీ రాష్ట్రంలో పార్టీ గెలుపు ఖాయంగా మారుతోందని పేర్కొన్నారు. బీజేపీ విధానాలు నచ్చి పలువురు పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని వెల్లడించారు. బీజేపీలో చేరిన వారిలో మేదరి సింధూజ, ఎంపెల్లి శశిలత, సమ్మక్క, ఐత శారద, జన్ను స్వరూప, ప్రమీల, మరాఠి లక్ష్మి, గజ్జి సరోజన, కొలేపాక కొమురమ్మ, ఇనుముల రాజు, పారునందుల శ్రీను, మహేందర్, అరవింద్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ భూక్య జవహర్, జిల్లా ప్రధాన కార్యదర్శి నగరపు రమేష్, ఉపాధ్యక్షులు జినుకల కృష్ణాకర్, మండల కార్యదర్శి వెల్పుగొండ రఘువీర్, నాయకులు గంగుల రాజు, సిద్దు, వినోద్, శ్రీతన్ లు పాల్గొన్నారు.






