బోటు ఏర్పాటు చేసిన ఏటూరునాగారం తహసిల్దార్
ఏటూరునాగారం,తెలంగాణజ్యోతి : ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని కొండాయి గ్రామస్తులు ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జంపన్న వాగు ఉప్పొంగి ప్రవహించడంతో ఏలిశెట్టి పల్లి మరియు కొండాయి గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి నెలకొనడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఏటూరునాగారం తహశీల్దార్ తక్షణమే స్పందించి గ్రామ ప్రజల రాకపోకల కోసం బోటును ఏర్పాటు చేశారు. ప్రజల సౌకర్యార్థం చేపట్టిన ఈ కార్యక్రమం స్థానిక ప్రజల నుండి ప్రశంసలు పొందుతోంది. ఈ కార్యక్రమంలో మండల గిర్ధావర్ కిరణ్ కుమార్, జూనియర్ సహాయకులు జె. నాగేష్, జి. కృష్ణ లు ఉన్నారు.