రాజ్యాంగాన్ని బిజెపి అనగదొక్కుతోంది
– భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణ రావు
– కాలనీలో జై బాపూ, జై భీమ్, జై సంవీధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర
కాటారం, తెలంగాణ జ్యోతి : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాజ్యాంగాన్ని అనగ దొక్కుతోందని, రాజ్యాంగం గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. గురువారం ఉదయం భూపాలపల్లి పట్టణంలోని 8, 27 వార్డులైన జవహర్ నగర్ కాలనీ లో కాంగ్రెస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ పిప్పాల రాజేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన జై భీమ్, జై బాపూ, జై సంవీధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొ న్నారు. బాపూ, అంబేద్కర్ రాజ్యాంగ పీఠిక చిత్రపటాలకు పూల మాల వేసి, కార్యకర్తలు, నాయకులు, ప్రజలతో రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని ఎమ్మెల్యే ప్రతిజ్ఞ చేయించారు. యాత్రను ద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ… మన దేశ రాజ్యాంగం అమలు లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. నేడు పేద, బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరటం లేదని, ప్రధానికి పేద ప్రజల కంటే బడా బాబులు ముఖ్యమన్నారు. రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదని, అంబేడ్కర్, గాంధీ, పూలే లాంటి గొప్ప వాళ్ళ ఆలోచనలతో కూడిన ఒక పవిత్ర గ్రంథమన్నారు. పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగాన్ని బీజేపీ పార్టీ అనగదొక్కాలని చూస్తుందన్నారు. అమిత్ షా అంబేడ్కర్ ను పార్లమెంట్ సాక్షిగా అవమానించారన్నారు. కాలనీలో యాత్ర మధ్యలో పలువురు కాలనీవాసులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వచ్చారు. వెంటనే ఆ సమస్యలను పరిష్కరించాలని అక్కడున్న మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. జవహర్ నగర్ కాలనీలో కాలనీలో కొత్తగా ఏర్పాటు చేసిన రేషన్ షాపును ఎమ్మెల్యే ముఖ్య ప్రారంభించారు. దొడ్డు బియ్యం పంపిణీలో జరుగుతున్న అక్రమాలను అరికట్టడంతో పాటు పేదలకు సన్న బియ్యం అందించాలనే కృతనిశ్చయంతో ప్రజా ప్రభుత్వం ఉందని ఎమ్మెల్యే తెలిపారు. సన్న బియ్యం పంపిణీ దేశంలోని ఆదర్శ పథకం అని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నా, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ పారదర్శక పాలన అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల ఆలోచన విధానంలో మార్పు వచ్చినప్పుడు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమని అన్నారు.జవహర్ నగర్ కాలనీలోని ఎమ్మెల్యే పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నమున్సిపల్ నిధులు రూ.2 లక్షల వ్యయంతో వేసిన మంచి నీటి బోరు మోటారును స్విచ్ఛాన్ చేసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రజలకు మంచి నీటి ఇబ్బంది లేకుండా చూడటమే తన లక్ష్యమని అన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల అభివృద్దే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు పిప్పాల రాజేందర్, దేవన్, శిరుప అనిల్, కార్యకర్తలు పాల్గొన్నారు.