మీడియా ప్రతినిదుల పైన జరిగిన దాడి బాధాకరం
– ఏ ఎన్ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహా మూర్తి.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : సినీ నటుడు మోహన్ బాబు మీడియా ప్రతినిధుల పైన చేసిన దాడి బాధాకరమని, ఇది రాజ్యాంగ విరుద్ధమని, ఆదివాసీ నవ నిర్మాణ సేన రాష్ట్రఅధ్యక్షులు కొర్స నర్సింహామూర్తి అన్నారు. దేశంలో మీడియా పైన దాడులు తీవ్రం అవుతున్నాయని, మీడియా పైన దాడిని పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛ పైన జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. మీడియా పై ఆధార పడి అంచ లంచలుగా ఎదిగిన సినీ నటుడు మోహన్ బాబు ఈ విధంగా వ్యవహ రించడం తల్లి పాలు త్రాగి రొమ్ము గుద్ధినట్టేనని అన్నారు. మీడియా కు ఆదివాసీ నవనిర్మాణ సేన అండగా ఉంటుందని పేర్కొన్నారు. దీన్ని ప్రతి పౌరుడు ఖండించాలని ప్రజలను కోరారు. ప్రజలకు ప్రబుత్వానికి వారధిగా ఉండే మీడియాకు భద్రత అవసరం ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు తీసుకువచ్చి మీడియాపై దాడులు చేసిన వారికి కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఏఎన్ఎస్ నేత కొర్స నరసింహమూర్తి ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు.