ఈనెల 8న 16వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక
ములుగు, సెప్టెంబర్ 6, తెలంగాణ జ్యోతి : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2024-25 ఆర్థిక సంవత్సరానికి (01.04.2024 నుండి 31.03.2025 వరకు) సంబంధించిన ఉపాధి హామీ పనులపై 16వ విడత సామాజిక తనిఖీ నిర్వహిస్తున్నట్లు ములుగు ఇన్‌ఛార్జి ఎంపీడీవో రహీం ప్రకటనలో తెలిపారు. ప్రజా వేదిక సమావేశం ఈనెల 8న ఉదయం 10 గంటలకు బండారుపల్లి రోడ్డులోని గిరిజన భవన్ ఆవరణలో జరగనుందని తెలిపారు. అందుకు సంబంధించి ప్రజాప్రతినిధులు, అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని రహీం కోరారు.