షెడ్యూల్డ్ ప్రాంతాల సర్వేల వల్లే 1/70 చట్టానికి తూట్లు

షెడ్యూల్డ్ ప్రాంతాల సర్వేల వల్లే 1/70 చట్టానికి తూట్లు

షెడ్యూల్డ్ ప్రాంతాల సర్వేల వల్లే 1/70 చట్టానికి తూట్లు

– ఆదివాసి సంక్షేమ పరిషత్ జిల్లా కన్వీనర్ పర్శిక సతీష్

వెంకటాపురం, ఆగస్టు28, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో గురువారం ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో మండల తహశిల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. షెడ్యూల్డ్ ప్రాంతాల చట్టాలను కాపాడాలని, అవి అమలులో ప్రభుత్వ అధికారులు విఫలమయ్యారని పరిషత్ జిల్లా కన్వీనర్ పర్శిక సతీష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ – భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 244(1) ప్రకారం ఐదవ షెడ్యూల్ ప్రాంతాల్లో ఆదివాసులకు ప్రత్యేక హక్కులు కల్పించబడి నప్పటికీ వాటిని విస్మరించారని అన్నారు. ఆదివాసులు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వకుండా రెవెన్యూ అధికా రులు అసైన్‌మెంట్ పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. వెంకటాపురం మండలంలోని అంకన్నగూడెం, వీరభద్రవరం, సూరవీడు, చిన్నడ, నూగూరు, మరికాల, బోదాపురం తదితర గ్రామాల్లో ప్రభుత్వ భూములు ధరణి పేరుతో వలస గిరిజనేతరులకు అక్రమంగా పట్టాలు జారీ అయ్యాయని, అందుకు సర్వేరు రిపోర్టులే కారణమని మండిపడ్డారు. 1970 తర్వాత గిరిజనేతరులు పొందిన అక్రమ పట్టా పాస్‌పుస్తకాలపై సమగ్ర విచారణ జరిపి, భూభారతి (ఆర్.ఓ.ఆర్) చట్టం–2025 ప్రకారం ఎల్.టి.ఆర్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పరిషత్ మండల ఉపాధ్యక్షుడు తాటి రాంబాబు, కార్యదర్శి కుర్షం శంకర్, బొగ్గుల రాజ్‌కుమార్, తాటి నాగరాజ్, పూనెం అర్జున్, సోడి మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment