TG | జనవరి 26 నుంచి రైతు భరోసా,కొత్త రేషన్ కార్డులు : సీఎం రేవంత్

TG | జనవరి 26 నుంచి రైతు భరోసా,కొత్త రేషన్ కార్డులు : సీఎం రేవంత్

TG | జనవరి 26 నుంచి రైతు భరోసా,కొత్త రేషన్ కార్డులు : సీఎం రేవంత్

హైదరాబాద్ :  తెలంగాణలో జనవరి 26 నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం’ అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మంత్రి వర్గ నిర్ణయాలను సీఎం మీడియాకు వివరించారు. తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి నూతన సంవత్సరంలో మంచి జరగాలి. రైతు భరోసా కార్యక్ర మంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా ఇస్తాం. ప్రతి ఎకరాకు ఏడాదికి రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం.భూమిలేని వ్యవసాయ కుటుంబాలకు ఏడాదికి రూ.12 వేలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ పథకానికి ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ అని నామకరణం చేశామన్నారు. జనవరి 26 నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు అమలు చేస్తాం” అని సీఎం ప్రకటించారు. వ్యవసాయ యోగ్యం కాని భూములకు (మైనింగ్, కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, రహదారులు, నివాస, పారిశ్రామిక, వాణిజ్య అవసరాలకు ఉపయోగించే భూములు, నాలా కన్వర్టెడ్ భూములు, వివిధ ప్రాజెక్టులకు ప్రభుత్వం సేకరించిన భూములకు) రైతుభరోసా వర్తించదన్నారు. ప్రభుత్వ ఆదాయం పెంచడం, ప్రజలకు పంచడమే మా ప్రభుత్వం విధానమన్నారు.అంతేకాకుండా.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తి పోతల పథకానికి మాజీ కేంద్రమంత్రి సూదిని జైపాల్ రెడ్డి పేరు పెట్టాలని తెలంగాణ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. సింగూరు ప్రాజెక్టుకు మంత్రి దామోదర రాజనర్సింహ తండ్రి, దివంగత మంత్రి రాజనర్సింహ పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ప్యాకేజీ 2 వ్యయం 1784 కోట్ల కు పెంచుతూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. పాలమూరు – రంగారెడ్డి లో భాగంగా ఎదుల–డిండికి 1800 కోట్ల అంచనా వ్యయానికి క్యాబినెట్​ ఆమోదం తెలిపింది. మరోవైపు.. పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్‌లో 588 కారుణ్య నియామకాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment