Tg | ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల సర్వేను పక్కాగా నిర్వహించాలి
– రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి
– ప్రజాపాలన 80 లక్షల ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారులలో ఏ ఒక్కదాన్ని వదలకుండా సర్వే చేయాలి
– ప్రతి 500 ఇండ్ల దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలనకు ఒక సర్వేయర్ నియామకం
– పకడ్బందీగా గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించాలి
– డిసెంబర్ 14న డైట్ చార్జీల పెంపు లాంచ్
– ఇందిరమ్మ ఇండ్లు, గ్రూప్ 2 పరీక్షల నిర్వహణ, డైట్ చార్జీల పెంపు, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన మంత్రి పొంగులేటి, సి.ఎస్. శాంతి కుమారి
హైదరాబాద్ : ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల సర్వేను పక్కాగా నిర్వహించాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. బుధవారం మంత్రి హైదరాబాద్ లోని సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర రాష్ట్ర ఉన్నతాధి కారులతో కలిసి ఇందిరమ్మ ఇండ్లు, గ్రూప్ 2 పరీక్షల నిర్వహ ణ, సంక్షేమ హాస్టల్స్, తదితర అంశాలపై వీడియో సమావేశం ద్వారా జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించ గా ఆన్లైన్ ద్వారా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్ బుర్ర వెంకటేశం వీడియో సమావేశం లో పాల్గొని గ్రూప్ 2 పరీక్షలు పకడ్బందీగా నిర్వహణపై సూచనలు చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టరేట్ వీడియోకాన్ఫరెన్స్ హాలు నుండి జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., అదనపు కలెక్టర్ రెవిన్యూ సి.హెచ్. మహేందర్ జి, అదనపు ఎస్.పి. సదానం దంలు పాల్గోన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడి సంవ త్సరం గడిచిన నేపథ్యంలో మనం చేసిన కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ డిసెంబర్ 9 వరకు ఘనంగా వేడుకలు జరిపిన అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. డిసెంబర్ 5న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇండ్ల యాప్ ను ప్రారంభించుకున్నా మని అన్నారు. ప్రజాపాలన ద్వారా మనకు సుమారు 80 లక్షల వరకు ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తులు వచ్చా యని, ఇందిరమ్మ ఇండ్ల యాప్ ద్వారా 80 లక్షల దరఖాస్తు లకు సంబంధించి సంపూర్ణ వివరాలు డిసెంబర్ నెలాఖరు లోపు సేకరించాలని, ప్రతి 500 ఇండ్ల దరఖాస్తుల సర్వే కోసం ఒక సర్వేయర్ ను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. పంచా యతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో ఇందిరమ్మ ఇండ్ల కమిటీ లను నియమించామని, వీరిని సమన్వయం చేసుకుంటూ వివరాల సేకరణ జరగాలని, షెడ్యూల్ ముందస్తుగానే ఇందిరమ్మ కమిటీల ద్వారా ప్రజలకు తెలియజేయాలని మంత్రి సూచించారు. ప్రస్తుతం మనం ఇందిరమ్మ ఇండ్ల యాప్ ద్వారా సేకరించే డేటా రాబోయే 4 సంవత్సరాలు ఉపయోగప డుతుందని, ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని పక్కాగా వివరాల సేకరణ ఉండాలని అన్నారు. ఈ సర్వేలో ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చిన ప్రతి దరఖాస్తు వివరాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి ఫోటో నమోదు చేయాలని అన్నారు. ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా పిల్లలకు అందించే డైట్ చార్జీలను 40 శాతం పెంచిం దని, డైట్ చార్జీల పెంపు లాంచ్ కార్యక్రమంతో పాటు ఈ విద్యా సంస్థలను రెగ్యులర్ గా తనిఖీ చేయాలని, ఈ పాఠశా లలో విద్యార్థులకు మెరుగైన ఆహారం అందే దిశగా కృషి చేయాలని అన్నారు. హస్టల్స్ కు సన్న రకం బియ్యం సరఫరా చేస్తున్నామని, ఇందులో అధికంగా నూక వస్తుందని ఫిర్యాదు లు ఉన్నాయని వీటిని పరిశీలించి కలెక్టర్లు నాణ్యమైన బియ్యం, విద్యాసంస్థలకు చేరేలా చూడాలని మంత్రి ఆదేశిం చారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ ప్రజా పాలన ద్వారా సేకరించిన దరఖాస్తులలో ఇందిరమ్మ ఇండ్ల క్రింద ప్రభుత్వానికి 80 లక్షల దరఖాస్తులు వచ్చాయని, వీటిని సర్వేయర్ ద్వారా ఇంటింటికి తిరుగుతూ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టడం జరుగుతుందని అన్నారు. జిల్లాల్లో ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు, ప్రతి 500 ఇండ్ల దరఖాస్తులు సర్వే కోసం ఒక సర్వేయర్ చొప్పున సర్వే చేసేందుకు అవసరమైన సిబ్బంది గుర్తించి వారికి శిక్షణ కార్యక్రమం 2 రోజులలో పూర్తి చేయాలని అన్నారు. ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రజలకు యాప్ ద్వారా సిబ్బంది వివరాల సేకరణకు వస్తున్నారని ముందస్తు సమాచారం అందించాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వేపై ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం నూతన దరఖాస్తులు తీసుకోవడానికి వీలు లేదని, పాత దరఖాస్తుల పరిశీలన కోసం మాత్రమే సర్వే చేస్తున్నా మని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల సర్వే కార్యక్ర మంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను భాగస్వామ్యం చేయాలని అన్నారు. గ్రూప్ 2 పరీక్షలను ఎటువంటి పొరపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని సీఎస్ అధికారులకు సూచించారు. డిసెంబర్ 14న జిల్లాలలో ఉన్న రెసిడెన్షియల్ పాఠశాలలు, సంక్షేమ హాస్టల్స్, మోడల్ స్కూల్స్, ఆశ్రమ పాఠశాలలు, కేజిబీవి లలో డైట్ చార్జీల పెంపు లాంచ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని సీఎస్ ఆదేశించారు. డైట్ చార్జీల పెంపు లాంచ్ కార్యక్రమానికి పిల్లల తల్లిదండ్రులను ఆహ్వానించాలని, ముఖ్యంగా తల్లి హాజరయ్యే విధంగా చూసుకోవాలని అన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు డైట్ చార్జీల పెంపు లాంచ్ కార్యక్రమం జరగాలని, ఆ రోజు ప్రతి విద్యా సంస్థలలో మెనూకు సంబంధించిన వివరాల కూడిన ఫ్లెక్సీ ప్రచురణ చేయాలని అన్నారు. పాఠశాలల్లో వంట గది నిర్వహణ, పిల్లలకు అందించాల్సిన నాణ్యమైన ఆహారం, తదితర అంశాలపై స్టాఫ్ కు అవగాహన కల్పించాలని అన్నారు. డైట్ చార్జీల పెంపు కార్యక్రమంలో మంత్రులు, జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు, పోలీసు ఉన్నతాధికారులు, రెవెన్యూ డివిజన్ అధికారులు, ఉన్నతాధికారులు పాల్గొనేలా చూడాలని సీఎస్ తెలిపారు. ఇంటింటి కుటుంబ సర్వే శుక్రవారం నాటికి పూర్తి చేయాలని, సర్వే వివరాలను ఆన్ లైన్ లో పక్కాగా నమోదు చేయాలని అధికారులకు సూచించారు. అనివార్య కారణాలవల్ల సర్వేలో పాల్గొన లేని వారు ప్రజాపాలన సేవ కేంద్రాలకు వచ్చి తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకోవచ్చని సీఎస్ స్పష్టం చేశారు.తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్ర వెంకటేశం మాట్లాడుతూ.. గ్రూప్ 1 & గ్రూప్ 3 పరీక్షలను విజయవంతంగా నిర్వహించామని, ఈ సంవత్సరం చివరగా గ్రూప్ 2 పరీక్షలను డిసెంబర్ 15, 16వ తేదీలలో 2 సెషన్స్ లలో జరుగుతాయని అన్నారు. గ్రూప్ 2 పరీక్షలలో అభ్యర్థులకు ప్రత్యేకంగా ఓఎంఆర్ షీట్ అందిం చడం జరుగుతుందని అన్నారు. గ్రూప్ 2 పరీక్షల నిర్వహణ సంబంధించి చేసిన ఏర్పాట్లను, పాటించాల్సిన నియమా లను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రతి పరీక్ష చాలా కీలకమని, ఎక్కడ ఎటువంటి చిన్న పొరపాటు జరగకుండా పకడ్బందీగా పరీక్షను నిర్వహించాలని చైర్మన్ కలెక్టర్లను కోరారు.ప్రతి అభ్యర్థికి ఓఎంఆర్ షీట్ ప్రత్యేకంగా ఉన్నందున పరీక్ష హాలులో అభ్యర్థి రాకపోయినా అతని స్థానంలో ఓఎంఆర్ షీట్ ప్రశ్నాపత్రం అలాగే పెట్టాలని, ఒకరి ఓఎంఆర్ షీట్ మరొకరికి ఇవ్వడానికి వీలు లేదని, పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు సకాలంలో చేరుకునేలా ముందుగానే విస్తృత ప్రచారం జిల్లాలలో కల్పించాలని, పరీక్ష సమయాలు, గేటు ఏ సమయంలో మూసి వేస్తాం వంటి అంశాలు విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు. ఈ సమావేశం లో ఐటిడిఏ డిడి పోచం, బి సి వెల్ఫేర్ ఆఫీసర్ రవీందర్ రెడ్డి, ఎస్సి వెల్ఫేర్ ఆఫీసర్ లక్ష్మణ్ నాయక్, డి ఈ ఓ పాణినీ, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.