ములుగు జిల్లా కేంద్రంలో ఆలయ భూమి అన్యాక్రాంతం..?
– శ్రీ హనుమాన్ ఆలయ భూమిని ఆక్రమించిన రియల్ వ్యాపారులు
– 2008లోనే భూమిని ఆలయానికి అప్పగించాలని సబ్ కలెక్టర్ ఆదేశం
– పట్టించుకోని రెవెన్యూ అధికారులు
– ఆలయ భూమిని రక్షించుకుంటామన్న పరిరక్షణ కమిటీ సభ్యులు
ములుగు ప్రతినిధి, జూన్24, తెలంగాణ జ్యోతి : కొందరు రియల్ వ్యాపారులు ఆలయ భూమికి ఎసరు పెట్టారు.. 1966-67 నుంచి ఆలయానికి చెందిన భుమిగా రికార్డుల్లో ఉండగా కొందరు రియల్ వ్యాపారుల కళ్ళు ఆ భూమి పై పడ్డాయి. 163జాతీయ రహదారికి అనుకొని ఉండటంతో ధనార్జనే ధ్యేయంగా అక్రమార్కులు పనులు చేస్తున్నారు.. ఆలయ భూమిలో ఏకంగా నిర్మాణాలు చేపట్టారు. దీంతో ఆలయ పరిరక్షణ కమిటీ సభ్యులు మంగళవారం భూమిని పరిశీలిం చారు. ములుగులోని శ్రీ హనుమాన్, శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి ఆలయం (శ్రీ క్షేత్రం) కు సంబంధించిన 1.01ఎకరాల భూమిని అక్రమిస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. ములుగు జిల్లా కేంద్రంలోని ఈదమ్మగడ్డ వద్ద అతి ప్రాచీనమైన పవిత్ర స్థలం శ్రీ హనుమాన్ ఆలయానికి చెందిన ఒక ఎకరం ఒక గంట భూమి 409/A/అ, 409/A/ఆ సర్వే నంబర్లలో ఉందని, ఆలయ భూమిలో కొందరు అక్రమ నిర్మాణాలకు పాల్పడుతు న్నారనీ విమర్శించారు. 2008 నవంబర్ 25న అప్పటి సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ సువర్ణ పాండాదాస్ ఈ భూమిని పరిరక్షించాలని తహసీల్దార్‌కు లేఖ రాశారాన్నరు. ఈ ఆలయ భూమి దేవర ఇనాం భూమిగా గుర్తింపు పొందిన ప్రాముఖ్యత గల స్థలమన్నారు. ప్రస్తుతం అదే భూమిలో అధికారులే స్వయంగా భాగస్వాములై బస్ షెల్టర్ నిర్మాణం చేపట్టడం సరికాదన్నారు. ములుగు పట్టణంలో చాలాచోట్ల ప్రభుత్వ ఖాళీ భూములు ఉన్నప్పటికీ, ప్రత్యేకంగా శ్రీ హనుమాన్ గుడి స్థలాన్ని మాత్రమే లక్ష్యంగా తీసుకున్నారనీ, ఇలాగే కొనసాగితే ఊరుకునేది లేదన్నారు. ఆలయ, హిందూ, ప్రజా సంఘాలతో కలిసి ఆలయ భూమి రక్షణకై పోరాడుతామని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ భూ పరిరక్షణ కమిటీ సభ్యులు చింతలపూడి భాస్కర్ రెడ్డి, సిరికొండ బలరాం, వాసుదేవ రెడ్డి, పౌడాల ఓం ప్రకాష్, కొత్త సురేందర్, శ్రీ క్షేత్రం ఆలయ కమిటీ అధ్యక్షుడు గండ్రకోట కుమార్, డాక్టర్ సుతారి సతీష్, ఇమ్మడి రాకేష్ యాదవ్, ఎల్కతుర్తి రాజన్న, చారి, శ్రీనివాస్, రాకేష్ రెడ్డి, తదితరులుఉన్నారు.