Tellam | భద్రాచలం ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన తెల్లం వెంకట్ రావు.

Written by telangana jyothi

Published on:

Tellam | భద్రాచలం ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన తెల్లం వెంకట్ రావు.

– అభినందించిన వెంకటాపురం, వాజేడు టిఆర్ఎస్ నాయకులు.

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : భద్రాచలం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పై ఘన విజయం సాధించిన డాక్టర్ తెల్లం వెంకటరావును, ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల బిఆర్ఎస్ నాయకులు, భద్రాచలం వెళ్లి అభినందనలు తో శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ తెల్లం వెంకట్రావు ఎన్నికల ప్రచారంలో వెంకటా పురం, వాజేడు మండలాలతో పాటు నియోజకవర్గాల్లోని మారుమూల గ్రామాల్లో సైతం పర్యటించి, ప్రతి ఒక్క ఓటర్ ను కలుసుకొని ఆదివాసి బిడ్డనైన తనను ఆశీర్వదించాలని, గ్రామ గ్రామాన ఓటర్ లను మహిళా సోదరీమణులను, రైతులను యువకులను,ఆదివాసి లను అభ్యర్థించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన అటవీ గ్రామాల్లో సైతం బిఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ వెంకట్రావు పోలీసుల హెచ్చరికలను సైతం ఖాతరు చేయకుండా అటవీ గ్రామాల్లో స్సతం ప్రతి ఒక్క ఓటరు ను అటవీ గ్రామాల్లో కలుసుకొని కారు గుర్తుకు ఓటు వేయాలని, పార్టీ నేతలతో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు భద్రాచలం నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జి శాసనమండలి సభ్యులు తాతా మధు ఆదేశం పర్యవే క్షణలో ఎన్నికల ప్రచారం విస్తృతంగా నిర్వహించారు. వెంకటా పురం మండల బిఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి గుడవర్తి నరసింహ మూర్తి ,పార్టీ మండల అధ్యక్షుడు గంపా రాంబాబు, కార్యదర్శి మురళి ,ఎం.పిపి .చెరు కూరి సతీస్ కుమార్, సీనియర్ నాయకులు ఎస్కే ముస్తాఫ ,డ ర్రా దామోదర్చింతల శ్రీను,  సఠ్ఫంచులు ,ఎంపిటిసీలు ,నాయ కులు ఇంకా అనేకమంది పార్టీ కార్య కర్తలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొ న్నారు. అలాగే వాజేడు మండలంలో ఎన్నికల ప్రచార ఇన్చార్జి మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బి. బుచ్చయ్య తో పాటు మండల కార్యదర్శి మండల పార్టీ అధ్య క్షుడు కృష్ణారెడ్డి, పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యక ర్తలు ప్రచార కార్యక్రమా ల్లో సొంత పనులు సైతం మానుకొని రెయిం భవళ్ళు అందరూ కష్టపడ్డారు. వారందరి ప్రచార శ్రమ ఫలితంగా భద్రాచలం నియోజక వర్గం ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి విజయం సాధించి నందుకు, ఓటర్ లకు పార్టీ నాయకులకు ప్రజాప్రతినిధులకు శాసన సభ్యులు గా గెలుపొందిన డాక్టర్ తెల్లం వెంకటరావుఅభినందనలు తెలిపా రు. ఎన్నికల ఫలితాలు లో భద్రాచలం నియోజకవర్గం బిఆర్ఎస్ వశం కావడంతో రెండు మండలాల పార్టీల నేతలు భద్రాచలం వెళ్లి నియోజకవర్గ ఇన్చార్జి శాసన మండలి సభ్యులు తాతామదు కు,మరియు గెలుపొందిన అభ్యర్థి, ఎంఎల్ఎ డాక్టర్ తెల్లం వెంకటరావు కు కృతజ్ఞతలు తెలియజేసి పట్టు శాలువాలతో సన్మానించారు. వారందరికీ ఎన్నికల ప్రచార ఇంచార్జి శాసన మండలి సభ్యులు తాతా మధు శాసనసభ్యులు వెంకట రావులు కృతజ్ఞతలు తెలిపారు. ఏజెన్సీ గిరిజన ప్రాంతమైన భద్రాచలం నియోజకవర్గం లోని ఐదు మండలాల్లో అభివృద్ధి సంక్షేమ పథకా లపై దృష్టి సారించి, నియోజక వర్గ ప్రజలకు సేవలు అందిస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అలాగే సోషల్ మీడియాలో తాను పార్టీ మారతానని ప్రచారం అవుతున్న వార్తలను భద్రాచలం శాసనసభ్యులు బిఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకటరావు తీవ్రంగా ఖండించారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now