Telangana Cm మందుబాబులకు షాకివ్వనున్న రేవంత్ సర్కార్..!
– బెల్టు షాపుల మూసివేతకు ప్లాన్ చేస్తున్న ప్రభుత్వం
– బెల్టు షాపులను క్లోజ్ చేస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ
డెస్క్ : తెలంగాణలో మందుబాబులకు రేవంత్ రెడ్డి సర్కార్ షాక్ ఇవ్వ నుంది… ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బెల్టు షాపుల మూసి వేత దిశగా ప్రభుత్వం కసరత్తును ప్రారంభించినట్లు తెలియవస్తున్న సమాచారం. తెలంగాణ వ్యాప్తంగా 2620 వైన్ షాపులు ఉన్నాయి. తెలంగాణలో 12 వేల 769 గ్రామాలు ఉండగా ఒక్కొ గ్రామంలో 2-5 బెల్టు షాపులు అనధికారికంగా ఉన్నట్లు అంచనాకొచ్చిన ప్రభుత్వం. అదేవిధంగా వైన్ షాపుల టైమ్ లిమిట్‌ను కుదించే ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది.