విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన టాటా మ్యాజిక్
– త్రుటిలో తప్పిన భారీ ప్రమాదం
వెంకటాపురం, అక్టోబర్ 11, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం–చర్ల ప్రధాన రహదారిపై మండల పరిధిలోని వీరభద్రవరం ఆయిల్ బంకు సమీపంలో శనివారం టాటా మ్యాజిక్ వాహనం అదుపు తప్పి రహదారి పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రమాదం సమయంలో విద్యుత్ సరఫరా కొనసాగుతున్న ప్పటికీ అదృష్టవశాత్తు షార్ట్ సర్క్యూట్ జరగలేదు. బ్రేకులు ఫెయిల్ కావడంతో వాహనం వ్యవసాయ మోటార్ లైన్ స్తంభం, ట్రాన్స్ఫార్మర్‌ను ఢీ కొట్టింది. డ్రైవర్ ఒక్కరే వాహనంలో ఉండగా కిందికి దూకడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందిన వెంటనే వెంకటాపురం విద్యుత్ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకుని విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఈ ఘటనపై టాటా మ్యాజిక్ వాహనంపై నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.