తిరుపతిలో ములుగు జిల్లా విద్యార్థుల ప్రతిభ
– నృత్య పోటీల్లో సంవిద పటేల్ కు
– అవార్డు సర్టిఫికెట్ మెమొంటో అందజేత
– అభినందించిన అధ్యాపక బృందం, కుటుంబ సభ్యులు,స్నేహితులు
ములుగు ప్రతినిధి : తిరుపతిలో ములుగు జిల్లా విద్యార్థు లు ప్రతిభ కనబరిచి పలువురు అభినందనలు పొందారు. తిరుమల తిరుపతి నగరంలో భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సౌజన్యంతో నిర్వహించిన ఆంధ్ర రాష్ట్ర సృజనాత్మక మరియు సాంస్కృతి క సమితి అమరావతి, తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించిన 24 వ వార్షిక పద్య నాటకములు,సాంఘిక నాటికలు శాస్త్రీయ జానపద బృంద నృత్య పోటీలు నిర్వహిం చారు. ఈ పోటీల్లో ములుగు పట్టణానికి చెందిన తపస్వి డ్యాన్స్ అకాడమీ మాస్టర్ శ్వేత ఆధ్వర్యంలో విద్యార్థులు ములుగు పట్టణానికి చెందిన రేండ్ల స్వాతి రాజు దంపతుల కూతురు రేండ్ల సంవిద పటేల్ , రమేష్ రమ్య దంపతుల కూతురు జోషిత, తదితరులు నృత్య ప్రదర్శనలో పాల్గొని ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా అభినయ ఆర్ట్స్, హనుమ అవార్డ్స్ ప్రతినిధులు ఆ విద్యార్థులకు మెమొంటో అవార్డు సర్టిఫికెట్లు అందజేశారు .కాగా కుటుంబ సభ్యులు స్నేహితులు బంధుమిత్రులు పాఠశాల అధ్యాపక బృందం సంవిధ పటేల్ జోశిత లను అభినందించారు. ఈ కార్యక్ర మంలో మాస్టర్ శ్వేత,మలిశెట్టి నాగేంద్ర, ప్రోగ్రాం అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.