పదవ తరగతి ఫలితాలలో బ్రాహ్మణి విద్యార్థుల ప్రతిభ
ములుగు,తెలంగాణ జ్యోతి: మండలంలోని ఇంచెర్ల గ్రామం లో ఉన్న బ్రాహ్మణి విద్యాలయం పదవ తరగతి ఫలితాలలో అత్యుత్తమ ఫలితాలు సాధించి జిల్లాలో నే ప్రథమ స్థానం లో నిలిచింది. ఇందులో ఇరువురు విద్యా ర్థులకి 10/10 GPA సాధించి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలవడం తో పాటు 100% రిజల్ట్స్ సాధించింది. ఈ సందర్భంగా విద్యాలయం లో జరిగిన కార్యక్రమం లో 10 GPA లు సాధించిన రామగిరి సాయి భవ్య తండ్రి : సుమలత (జంగాలపల్లి), ఇప్పలపల్లి వేద తండ్రి : రమేష్(కమలాపూర్) లను విద్యాలయ ప్రదానో పాద్యాయులు కర్ర రాజేందర్ రెడ్డి, డైరెక్టర్ కనుకుల చంద్రారెడ్డిలు, ఉపాద్యాయులు ఘనంగా సత్కరించి అభినం దనలు తెలిపారు.