విలేకరిపై దాడిని ఖండించిన తాడ్వాయి విలేకరులు

విలేకరిపై దాడిని ఖండించిన తాడ్వాయి విలేకరులు

విలేకరిపై దాడిని ఖండించిన తాడ్వాయి విలేకరులు

తాడ్వాయి, జూన్ 25, తెలంగాణ జ్యోతి : మండలంలోని నార్లాపూర్ గ్రామానికి చెందిన ఆంధ్రజ్యోతి విలేకరి చల్లగొండ శ్రీకాంత్ రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ తాడ్వాయి మండల విలేకరులు మంగళవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరం ఉందని, పాత్రికేయులపై దాడులు హేయనీయమని అని వారు పేర్కొన్నారు. శ్రీకాంత్ రెడ్డిపై దాడికి పాల్పడిన కాంగ్రెస్ కార్యకర్తలపై వెంటనే కేసులు నమోదు చేసి వారిని శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పత్రికా స్వేచ్ఛను పరిరక్షించండి, పాత్రికేయులపై దాడులు ఆపండి అంటూ నినాదాలు చేశారు. ర్యాలీలో  లక్ష్మణ్, రమేష్, సారయ్య, పురుషోత్తం, ప్రతాప్, సంపత్, దేవేందర్, నరసింహ, సమ్మయ్య, నవీన్ రెడ్డి లు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment