యువతకు చోదకశక్తి స్వామి వివేకానంద
– స్వామి వివేకానంద యువతకు మార్గదర్శి
– మానుకోట సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్
మహబూబాబాద్, తెలంగాణ జ్యోతి : మనిషిగా మేలుకో, బలహీనతల్ని తొలగించుకో, పౌరుషాన్ని ప్రసాదించికో, లే లెమ్మంటూ యువతను జాగృతం చేసిన స్వామి వివేకానంద నవభారతావనికి ముందుండి నడిపే చోదకశక్తిగా నిలిచారని మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ అన్నారు. శుక్రవారం జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా స్వామి వివేకానంద 161వ జయంతిని సబ్ రిజిస్ట్రార్ కార్యా లయం ఎదుట నిర్వహించారు. వివేకానంద చిత్రపటానికి తస్లీమా పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తస్లీమా మాట్లాడుతూ దేశాభివృద్ధి యువశక్తి పైనే ఆధారపడి ఉందని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద అని, ఆయన యువతకు మార్గదర్శకుడని తస్లీమా అన్నారు. యువకులు సమాజంలో ఎదురయ్యే అడ్డంకులకు తలోగ్గ కుండా ధైర్యంగా ఎదురొడ్డి నిలవాలని తస్లీమా సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, యువకులు, రిజిస్ట్రేషన్ దారులు, తదితరులు ఉన్నారు.