విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలి : కలెక్టర్ దివాకర

విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలి : కలెక్టర్ దివాకర

విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలి : కలెక్టర్ దివాకర

  • చదువే ఆయుధం.. ప్రతివిద్యార్థి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి…

గోవిందరావుపేట, జూలై 24, తెలంగాణ జ్యోతి : ప్రభుత్వ పాఠశాలలలో చదువును విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ఉపాధ్యాయులకు సూచించారు. గురువారం ఆయన గోవిందరావుపేట మండలం పసర గ్రామంలోని జెడ్పీ హెచ్‌ఎస్ పాఠశాలకి ఆకస్మికంగా సందర్శించారు. ఈసందర్బంగా ఆయన ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్‌తో పాటు మధ్యాహ్న భోజనానికి సంబంధించిన వివరాలను పరిశీలించారు. తరగతులలోకి వెళ్లి విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి యూనిఫామ్స్, నోట్‌బుక్స్, మధ్యాహ్న భోజనం వంటి అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. భోజనం నాణ్యతపై ఫుడ్ కమిటీ విద్యార్థులతో చర్చించి మెనూ ప్రకారం భోజనం అందుతోందా? నాణ్యత కాపాడబడుతోందా? అనే విషయాలను గమనించారు. 9వ, 10వ తరగతి విద్యార్థుల పఠన సామర్థ్యాన్ని పరీక్షించి, అందరూ ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని Collector సూచించారు. ఏ విద్యార్థి ఏ సబ్జెక్టులో బలహీనంగా ఉన్నాడో గుర్తించి రివిజన్ తరగతులు నిర్వహించాలని చెప్పారు. విద్యార్థుల హాజరును గమనించి, ప్రతి రోజూ పాఠశాలకు వచ్చేలా మానిటరింగ్‌ చేయాలని సూచించారు. కలెక్టర్ మాట్లాడుతూ, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ద్వారా అన్ని పాఠశాలల్లో త్రాగునీరు, విద్యుత్, మూత్రశాలలు, వంటశాల, ప్రహారీగోడ వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నదని తెలిపారు. మధ్యాహ్న భోజనం తయారీలో నాణ్యత, పరిశుభ్రత పాటించాలని, తాజా కూరగాయలు, నాణ్యమైన పదార్థాలు వినియోగించాలని, శుద్ధమైన త్రాగునీరు అందించాలని సూచించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాల పరిసరాల్లో పారిశుద్ధ్యాన్ని కచ్చితంగా పాటించాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ వివరించారు. బడి బయట పిల్లలు, మధ్యలో చదువు మానేసిన విద్యార్థులను గుర్తించి వారి తల్లిదండ్రులతో మాట్లాడి తిరిగి బడికి రప్పించేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment