ట్రాఫిక్ రూల్స్ పై విద్యార్థులకు అవగాహన
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం వెంకటాపురం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా ట్రాఫిక్ రూల్స్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. వెంకటా పురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బండారి కుమార్ ఈ సందర్భం గా మాట్లాడుతూ విద్యార్థులలో బాల్యం నుండే ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కలిగి ఉండటం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుం దని తెలిపారు. రోడ్డు భద్రత, ఇతర అంశాలపై సుదీర్ఘంగా విద్యా ర్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వెంకటాపు రం పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కె.తిరుపతిరావు, పాఠశాల ప్రధానోపా ధ్యాయులు, ఉపాధ్యాయుల బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.