జెండా పండుగ రోజే విద్యార్థి మృతి
– కమ్మరిగూడెం గ్రామంలో విషాదం
వెంకటాపురం, ఆగస్టు 15, తెలంగాణ జ్యోతి : స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల రోజు ములుగు జిల్లా వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామపంచాయతీ కమ్మరిగూడెంలో విషాదం నెలకొంది. రెండవ తరగతి చదువుతున్న తోకల నితీష్ కుమార్ (6) అనారోగ్యంతో మృతి చెందాడు. శుక్రవారం ఉదయం స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనడానికి సిద్ధమవుతున్న నితీష్ స్నానం చేసి దుస్తులు మార్చుకుని పాఠశాలకు బయలుదేరే సమయంలో అకస్మాత్తుగా నొప్పి అనిపించి కుప్పకూలాడు. తల్లిదండ్రులు హుటాహుటిన వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.