విద్యుత్ తీగలతో కరెంటు ఉచ్చులు అమర్చితే కఠిన చర్యలు
– వెంకటాపురం సిఐ బండారి కుమార్
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం సి.ఐ బండారి కుమార్ ఆధ్వర్యంలో మండల పరిధిలోని మంగవాయి గ్రామంలో శనివారం రాత్రి కార్డాన్ అండ్ సెర్చ్ తనిఖీలు నిర్వహించి కరెంటు ఉచ్చులపై గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ పంట రక్షణ కోసం లేదా,అడవి పందులు వేట కోసం విద్యుత్ తీగలు (కరెంటు ఉచ్చులు) అమర్చడం వలన మనుషులు, పశువులు ప్రాణాలు కోల్పోవటం, త్రీవ గాయాల పాలయిన సంఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. ఎవ్వరూ కూడ విద్యుత్ తీగలు (కరెంటు ఉచ్చులు) అమర్చోద్దని, అమర్చిన వారిపై సెక్షన్ 105, బిఎన్ఎస్ 135 చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం ఎస్సై కే తిరుపతిరావు సిఆర్పిఎఫ్, మరియు సివిల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.