ఇసుక రవాణాలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు
– మంగపేట మండలంలో క్వారీల వద్ద ఆకస్మిక తనిఖీ
ములుగు ప్రతినిధి : నిబంధనలకు విరుద్ధంగా ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డా పి.శబరీష్ అన్నారు. గురువారం ములుగు జిల్లా మంగపేట మండలం రాజుపేట, కత్తిగూడెం ఇసుక క్వారీలను జిల్లా ఎస్పీ శబరీష్ మాట్లాడుతూ.. ఇసుక క్వారీలలో పనిచేసే సిబ్బంది తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ, ప్రభుత్వ నిబంధనలకు విఘాతం కలిగిస్తే పోలీసు కేసులు నమోదు చేస్తామన్నారు. క్వారీలోని ఇసుక నిల్వలపై ఆరాతీసి, క్వారీ ఆఫీసులో ఉన్న రికార్డులను పరిశీలించారు. క్వారీలో పనిచేసే సిబ్బంది జీరో బిల్లులు, డబుల్ ట్రిప్, అదనపు లోడ్, నకిలీ బిల్లులు, తప్పుడు వాహనంలో రవాణా, నమోదు చేసిన ప్రాంతానికి కాకుండా ఇతర స్థానాలకు తరలించడం లాంటి ఉల్లంఘన లకు పాల్పడితే ఊరుకునేదిలేదన్నారు. ఎవరైనా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీలలో ఏటూరు నాగారం సీఐ ఏ.శ్రీనివాస్, మంగపేట ఎస్సై టీవీఆర్ సూరి, మరియు సిబ్బంది పాల్గొన్నారు.
1 thought on “ఇసుక రవాణాలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు”