వాజేడు ఉన్నత పాఠశాలలో ఎస్ ఎస్ సి స్టడీ మెటీరియల్ పంపిణీ

On: February 5, 2026 4:37 PM

SSC study material distributed at Wajedu High School.

వాజేడు ఉన్నత పాఠశాలలో ఎస్ ఎస్ సి స్టడీ మెటీరియల్ పంపిణీ

వెంకటాపురం,ఫిబ్రవరి5,తెలంగాణ జ్యోతి:  వాజేడు మండలం నాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో గురువారం డీఎన్‌ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూపొందించిన ‘డీఎన్‌ఆర్ విజయపథం’ ఎస్ ఎస్ సి స్టడీ మెటీరియల్‌ను ఉచితంగా పంపిణీ చేశారు. మండలంలోని వివిధ ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు ఈ మెటీరియల్ అందజేశారు. కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు సోయం ఆనందరావు అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాశాఖ అధికారి తేజవత్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. గత 17 సంవత్సరాలుగా డీఎన్‌ఆర్ ట్రస్ట్ గుణాత్మక విద్యాభివృద్ధికి కృషి చేస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా జడ్పీహెచ్ఎస్ వాజేడు నాగారం నుంచి 26 మంది, జడ్పీహెచ్ఎస్ ధర్మవరం నుంచి 14 మంది పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నునావత్ శ్రీకాంత్, బొగ్గం కుమార్‌బాబు, కంచు ప్రభాకర్, వశ్య తదితరులు పాల్గొన్నారు.

 

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!