నాసా ప్రాజెక్టులో శ్రీ చైతన్య విద్యార్థుల ఘనత

నాసా ప్రాజెక్టులో శ్రీ చైతన్య విద్యార్థుల ఘనత

నాసా ప్రాజెక్టులో శ్రీ చైతన్య విద్యార్థుల ఘనత

భూపాలపల్లి, జూలై 19, తెలంగాణ జ్యోతి : భూపాలపల్లి పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు రూపొందించిన “పునర్జీవనం”(Revival) ప్రాజెక్ట్‌ జాతీయ స్థాయిలో మూడో స్థానం పొందడం గర్వకారణమని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా. రమణారావు మాట్లాడుతూ విద్యార్థి దశలోనే ఇలాంటి సృజనాత్మకత ప్రదర్శించడం అభినందనీయం అన్నారు. కాలానుగుణంగా అభివృద్ధి చెందేందుకు విద్యార్థుల ఆలోచనా విధానం మరింత విస్తృతంగా ఉండాలని సూచించారు. పాఠశాల ప్రిన్సిపల్ ప్రసాద్ మాట్లాడుతూ, ఈ విజయం విద్యార్థుల కృషికీ, గురువుల ప్రోత్సాహానికీ నిదర్శనమన్నారు. శ్రీ చైతన్య సంస్థల భాగస్వామ్యం విద్యార్ధుల అభివృద్ధిలో కీలకంగా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విజేతలైన విద్యార్థులకు షీల్డ్‌లు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య సంస్థల చైర్మన్ విద్య గారు, శ్రీధర్ గారు, డీజీఎం చేతన్, ఏజీఎం పద్మాకర్, కోఆర్డినేటర్ శివ కోటేశ్వరరావు, డీన్ స్వామి, నాసా ఇంచార్జ్ గణపతి తదితరులు పాల్గొని విద్యార్థులకు అభినందనలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment