ప్రారంభమైన శ్రీ బీరమయ్య జాతర

ప్రారంభమైన శ్రీ బీరమయ్య జాతర

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలం ఛత్తీస్గడ్ సరిహద్దులోని లొట్టిపీటగండీ అభయారణ్యం కొండలపై వేంచేసి ఉన్న శ్రీ భీరమయ్య జాతర అపర భీష్మా శంకరుని పూజా కార్యక్రమాలు శనివారం నుండి  వైభవంగా ప్రారంభమయ్యాయి. జాతర మహోత్సవాలు ఈనెల 12 నుండి 14 వరకు మూడు రోజులు పాటు భక్తుల నిరాజనాల తో నేత్రపర్వంగా జరగనున్నాయి. ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాలతోపాటు చతిస్గడ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు తరలిరానున్నారు. శనివారం 12వ తేదీ శ్రీ భీరమయ్య జాతర ప్రారంభోత్సవానికి కడేకల్ నుండి సాంప్రదాయ ప్రకారం దేవర పూనకాలతో లక్ష్మీదేవరను సన్నాయి, డోలీ, వాయిద్యాల మధ్య గ్రామీణ యువత, భక్తిరస నినాదాలు, ఊరేగింపులతో అమ్మవార్లను భిరమయ్య జాతర అభయారణ్యానికి తోడుకొని రావడంతో జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.

[metaslider id="19893"]

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment