క్రీడలు ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తాయి.
– సైక్లింగ్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సారయ్య యాదవ్
– సైక్లింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షునిగా అశోక్
ములుగు, డిసెంబర్19, తెలంగాణ జ్యోతి : క్రీడలు విద్యార్థుల్లో మానసిక, శారీరక ఉల్లాసానికి దోహదపడటంతో పాటు ఆత్మ స్థైర్యాన్ని పెంపొందిస్తాయని సైక్లింగ్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్య క్షుడు కన్నెబోయిన సారయ్య యాదవ్ అన్నారు. మంగళవారం ములుగులో ఇంఛార్జి డీవైఎస్ వో వెంకన్న ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సైక్లింగ్ అసోసి యేషన్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ నానం రాజయ్యతో కలిసి జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సారయ్య యాదవ్ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో రాణించాలని, శరీరానికి వ్యాయామం ఎంతో ఉపయోగ పడుతుందని పేర్కొన్నారు. క్రీడాకారులకు ఉద్యోగ రంగాల్లో ఎన్నో అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. సైక్లింగ్ అనేది విద్యార్థు లకు ఎంతో ఉపయోగపడుతుందని, క్రీడలను ప్రోత్సహించాలని కోరారు. ఈ సంద్భంగా అసోసియేషన్ నూతన అధ్యక్షునిగా పోరిక అశోక్ బాబును ఎన్నుకున్నారు. పోషకులుగా దొంతిరెడ్డి బలరాం రెడ్డి, గండ్రకోట కుమార్, గౌరవ అధ్యక్షునిగా బాదం ప్రవీణ్, ఉపాధ్య క్షులుగా సంగ రంజిత్, సుంకరి సహదేవ్, రావులపల్లి శ్రీధర్, ప్రధాన కార్యదర్శిగా పోరిక ఆస్సిలాల్,ప్రచార కార్యదర్శిగా జి.విష్ణు,సంయు క్త కార్యదర్శులుగా యేట్టి భూషణం, జక్కుల రేవంత్ యాదవ్, చిలపాక ఆనంద్, కోశాధికారిగా పోరిక మోహన్ లాల్, సలహాదా రుగా సంగ చేరాలు, బల్గూరి వేణు, కార్యవర్గ సభ్యులు గా సంపంగి సాంబ రాజు, రెబెల్లి రమేష్, ఉప్పు నరేష్ లు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో పీఈటీలు గుండబోయిన మల్లయ్య, మాధవి, తదితరులు పాల్గొన్నారు.
1 thought on “క్రీడలు ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తాయి.”