వెంకటాపురంలో ఘనంగా రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు

On: March 21, 2026 4:56 PM

వెంకటాపురంలో ఘనంగా రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు

వెంకటాపురంలో ఘనంగా రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు

పెద్ద ఎత్తున తరలివచ్చిన ముస్లిం సోదరులు 

పరస్పరం శుభాకాంక్షలు

వెంకటాపురం నూగూరు, మార్చి 21, తెలంగాణ జ్యోతి: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు శనివారం ఘనంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాలకు చెందిన ముస్లిం సోదరులు వెంకటాపురం మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ గోదాం ఆవరణలో ఉదయం సమిష్టిగా ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమానికి రెండు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో  తరలి వచ్చి రంజాన్ పర్వదినాన్ని ఆనందంగా జరుపుకున్నారు. ఇమామ్ సాబ్ మహమ్మద్ రహమాన్ ఆధ్వర్యంలో ప్రార్థనలు నిర్వహించగా, అనంతరం పరస్పరం రంజాన్ శుభాకాంక్షలు తెలియ జేసుకున్నారు. ఈ సందర్భంగా శాంతి భద్రతల దృష్ట్యా వెంకటాపురం పోలీస్ అదనపు ఎస్సై ఎం.సాయి కృష్ణ, ఏఎస్ఐ బి.పురుషోత్తం ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ పండుగ సందర్భంగా ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, ప్రముఖులు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈదుల్ ఫితర్ వేడుకలను సమన్వయంతో, ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు ముస్లిం సంఘ పెద్దలు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సంఘ పెద్దలు ఎండి షబీర్, సయ్యద్ హుస్సేన్, హోలీ హైదర్, అన్వర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!