వ్యవసాయ రంగంలో స్పీక్ సేవలు అభినందనీయం

Written by telangana jyothi

Published on:

వ్యవసాయ రంగంలో స్పీక్ సేవలు అభినందనీయం

 -జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ మెంబర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి

 మంగపేట, డిసెంబర్ 5, తెలంగాణ జ్యోతి : వ్యవసాయ రంగంలో స్పీక్ ఫర్టిలైజర్స్ కంపెనీ సేవలు అభినందనీయమని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ మెంబర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి అన్నారు . మంగళ వారం మంగపేట మండలం అకినేపల్లి మల్లారం వికాస్ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ మరియు సీడ్స్ ఆధ్వర్యంలో స్పీక్ వరంగల్ రీజనల్ మేనేజర్ షేక్ ముల్లా సుభాన్ అధ్యక్షతన నిర్వహించిన రైతు అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా నాసిరెడ్డి సాంబశివరెడ్డి మాట్లాడుతూ స్పీక్ మరియు గ్రీన్ స్టార్ ఎరువుల సంస్థలు రైతుల కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయన్నారు. వ్యవసాయ రంగంలో వస్తున్న అనునాతన సాగు పద్ధతులకు అనుగుణంగా వివిధ రకాల సూటి మరియు సూక్ష్మ ఎరువులను యాజమాన్యం అందిస్తోందన్నారు స్పీక్ సంస్థ ప్రవేశపెట్టిన స్పీక్ బోనంజ పథకంలో రైతులందరూ భాగస్వాములై విలువైన బహుమతులు గెలుచుకోవాలని సాంబశివరెడ్డి కోరారు స్పీక్ మరియు గ్రీన్ స్టార్ సంస్థలు రైతుల కోసం ఉచితంగా భూసార పరీక్షలు సాగునీటి పరీక్షలు నిర్వహించటం ఆధునిక సేద్య పద్ధతులు తెలియటం కోసం గ్రామీణ ప్రాంతాల్లో రైతు సదస్సులు నిర్వహించటం సంతోషకరమన్నారు స్పీక్ వరంగల్ రీజనల్ మేనేజర్ షేక్ ముల్లా సుభాన్ మాట్లాడుతూ రైతుల అవసరాలకు అనుగుణంగా సకాలంలో ఎరువులను తమ స్పీక్ మరియు గ్రీన్ స్టార్ సంస్థలు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు ప్రస్తుత రబీ సీజన్ లో స్పీక్ బోనంజ పథకం కింద స్పీక్ జెన్ ఎంపవర్ నరీష్ సూక్ష్మ పోషకాల ఉత్పాదనలపై కూపన్లు అందజేస్తున్నట్లు తెలిపారు ఈ కూపన్ల ద్వారా గెలుపొందిన రైతులకు విలువైన బహుమతులను పంపిణీ చేస్తున్నట్లు సుభాన్ తెలిపారు వికాస్ ఫెర్టిలైజర్స్ ద్వారా అకినేపల్లి మల్లారం మరియు పరిసర ప్రాంత గ్రామాలకు సుమారు పదివేల కూపన్లు అందిస్తున్నామని ఈ ప్రాంత రైతాంగం తమ ప్రత్యేక ఉత్పత్తులను కొనుగోలు చేసి భోనోంజ పథకంలో భాగస్వాములు కావాలని రైతులకు విజ్ఞప్తి చేశారు అనంతరం స్పీక్ మరియు గ్రీన్ స్టార్ ఉత్పత్తులను ప్రదర్శించి బోనంజా పధకంలో విజేతలైన రైతులకు శిల్పాలిన్ పరదాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో స్పీక్ సేల్స్ ఆఫీసర్ శ్రీనివాస్ డెవలప్మెంట్ ఆఫీసర్ పవన్ అకినేపల్లి మల్లారం రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ షేక్ మదర్ సాహెబ్ వీరాపురం కోఆర్డినేటర్ పాడి దామోదర్ రెడ్డి అకినేపల్లి మల్లారం నరసింహసాగర్ దోమెడ టీ కొత్తగూడెం తదితర గ్రామాలను చెందిన సుమారు వందమంది రైతులు పాల్గొన్నారు

Tj news

1 thought on “వ్యవసాయ రంగంలో స్పీక్ సేవలు అభినందనీయం”

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now